సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి హృదయాలను కొల్లగొట్టాడు. 55 బంతుల్లో 141 పరుగులు సాధించి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 246 పరుగుల లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) జట్టుపై ఒత్తిడి పెరిగింది. కానీ అభిషేక్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తున్నామని జట్టుకు భరోసా ఇచ్చాడు. అభిషేక్ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేయగానే తన జేబులోంచి ఒక స్లిప్ తీసి ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు. దీని వెనుక ఉన్న రహస్యాన్ని ట్రావిస్ హెడ్ మ్యాచ్ తర్వాత వెల్లడించాడు.
Also Read:Urvashi Rautela : ఐటమ్ సాంగ్స్‌తో కేక పుట్టిస్తోన్న హాట్ బ్యూటీ.. కానీ?
అభిషేక్ తన జేబులోంచి తీసిన స్లిప్ మీద ‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’ అని రాసి ఉంది. అంటే అతను ఈ సెంచరీని అభిమానులకు అంకితం చేశాడన్నమాట. సీజన్ ప్రారంభం నుంచి ఆ స్లిప్ అభిషేక్ జేబులోనే ఉందని ట్రావిస్ హెడ్ మీడియాకు చెప్పాడు. ఆరో గేమ్‌లో దాన్ని బయటకు తీసే అవకాశం అతనికి లభించిందని తెలిపాడు. అభిషేక్ శర్మ 6 మ్యాచ్‌ల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఫైనల్ గా ఈరోజు సాధించాడని తెలిపాడు. పంజాబ్ కింగ్స్‌పై అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తొలి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీని కారణంగా హైదరాబాద్ 246 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.
Also Read:Gorantla Madhav: గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. 12 మంది పోలీసులపై చర్యలు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. పంజాబ్ తరఫున ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. నెహాల్ వధేరా 27 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ తరఫున హర్షల్ పటేల్ బౌలింగ్ తో చెలరేగి 4 ఓవర్లలో 42 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్ కేవలం 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.