SRH vs RR: రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్స్.. సన్‌రైజర్స్ భారీ స్కోర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. రెండు జట్లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేతిలో ఉంది. హైదరాబాద్ పగ్గాలు పాట్ కమ్మిన్స్ చేతిలో ఉన్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. బారిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ రెచ్చిపోయింది. 14 ఓవర్లలోనే 200 స్కోర్ పూర్తి చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాలంటే 287 పరుగులు సాధించాల్సి ఉంది. ఇద్దరు కీలక ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ 45 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. చివరి బాల్ వరకు ఆడిన ఇషాన్ కిషన్ (106) బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రావిస్ హెడ్(67) మెరుపు వేగంతో ఆడాడు. క్లాసెన్(34), తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ(24) పరుగులు సాధించారు.
READ MORE: Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో 50,000 దాటిన మరణాల సంఖ్య..
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా క్రీజులోకి దిగారు. మొదట్లోనే విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మహీష్ తీక్షణ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. యశస్వి జైస్వాల్ క్యాచ్ పట్టడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు. వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అనంతరం ట్రావిస్ హెడ్ దంచి కొట్టాడు. 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో హిట్ మేయర్‌కు క్యాచ్ ఇచ్చిన ట్రావిస్ హెడ్ (67).. పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(30).. మహీష తీక్షణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నితీశ్, ఇషాన్ కిషన్ 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో హెన్రిచ్ క్లాసెన్ బరిలోకి క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్లాసెన్(34) వీర బాదుడు బాదాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (34) వెనుదిరిగాడు. క్రీజ్‌లోకి వచ్చిన అంకిత్ వర్మ, అభివనవ్ మనోహర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో వెంట వెంటనే ఔట్ అయ్యారు. మరోవైపు తుషార్ దేశ్‌పాండే(3), మహీష తీక్షణ(2), సందీప్ శర్మ(1) చోప్పున వికెట్లు తీశారు.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!