తమిళనాడులో మంగళవారం ఉదయం రైలు ప్రమాదం తప్పింది. పుదుచ్చేరికి వెళ్తున్న మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. విల్లుపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. లోకో పైలట్ దానిని చూసి వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు గంటల్లోనే రైలు రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు.…
Train Incident: రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల పైకి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిపోదు. మన దృష్టి పూర్తిగా రైళ్లపై, రైల్వే ప్లాట్‌ఫారమ్ లపై ఉండటం చాలా ముఖ్యం. తాజాగా ఓ రైలు ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో ఫుటేజ్‌లో, ఒక మహిళ తన చేతుల్లో శిశువును పట్టుకుని రైల్వే ప్లాట్‌ఫారమ్ పై తన స్నేహితులతో కలిసి ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తోంది. మొబైల్ సంభాషణలో బిజీగా ఉన్న ఆమె రైలు…
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏడు పెద్ద రైల్వే ప్రమాదాలు జరిగాయి. వాటిలో నాలుగు రైళ్లు పట్టాలు తప్పడం వల్ల సంభవించాయి. గతేడాది జరిగిన అతిపెద్ద ప్రమాదాలను అస్సలు మర్చిపోలేం.
Ashwini Vaishnaw: ‘‘రీల్ మినిస్టర్’’ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మీ రికార్డులు చూసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు ఇతన ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో రైలు ప్రమాదాలు 68 శాతం తగ్గినట్లు చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ఏళ్ల చిన్నారి సహా 10 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ఈ ప్రమాదం తర్వాత రైలు ప్రయాణంలో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా.. స్వదేశీంగా రూపొందించిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశమైంది. దీనిని మూడు…
పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 8 మంది మరణించారు. అంతేకాకుండా.. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కాగా.. ఈ రైలు ప్రమాద ఘటనపై ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ యాదవ్ ప్రశ్నలు సంధించారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో కాగ్ నివేదికలను ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జను ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
రైళ్ల ప్రమాదాలు తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. కవాచ్ పేరుతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థను భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టింది.