Mallikarjun Kharge: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో కాగ్ నివేదికలను ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జను ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రైల్వేలో ప్రమాదాలు, భద్రతా ప్రమాణాలకు సంబంధించి వచ్చిన హెచ్చరికలను ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని సోమవారం ప్రధానికి రాసిన లేఖలో ప్రశ్నించారు. ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేయాలని రైల్వే మంత్రి చెప్పడం సరైంది కాదన్నారు. నేరాలపై దర్యాప్తు చేసే సీబీఐతో రైల్వే ప్రమాదంపై దర్యాప్తు చేయించడం ఏంటని ప్రశ్నించారు. రైలు ప్రమాదాలు, భద్రతకు సంబంధించిన పలు ప్రశ్నలను సందిస్తూ ప్రధాని మోడీకి ఖర్గే సుదీర్ఘ లేఖ రాశారు.
Read also: Sudigali Sudheer: ‘గాలోడు’ రేంజ్ మాములుగా పెరగలేదు.. చిత్రమ్మనే రంగంలోకి దింపేశాడుగా
రైల్వే ప్రమాదాలను సీబీఐ దర్యాప్తు చేయదని కాంగ్రెస్ అధ్యక్షులుమల్లికార్జున్ ఖర్గే అన్నారు. వారికి రైల్వేకు సంబంధించిన అనేక సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదని తెలిపారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలైన కారణాలను ప్రభుత్వం వెలుగులోకి తీసుకురావాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో కోరారు. ఘోర ప్రమాదానికి కారణమైన నిజమైన కారణాలను ప్రభుత్వం వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ప్రధాని, రైల్వే శాఖ మంత్రి రైల్వే శాఖలో సమస్యలున్నాయని అంగీకరించేందుకు సిద్ధంగా లేరని లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికే రైలు ప్రమాదానికి మూలకారణాన్ని కనిపెట్టామని రైల్వే మంత్రి చెప్పారని .. మళ్లీ దర్యాప్తు చేయాలని సీబీఐకి సూచించారని గుర్తు చేశారు. సీబీఐ ఉన్నది నేరాలపై దర్యాప్తు చేయడానికి గానీ.. రైల్వే ప్రమాదాలపై విచారణ చేయడానికి కాదన్నారు. సీబీఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థ కూడా సాంకేతిక, శాఖాపరమైన, రాజకీయ వైఫల్యాలను గుర్తించలేదన్నారు. వాటికి తోడు రైల్వే భద్రత, సిగ్నలింగ్, నిర్వహణకు సంబంధించి వారికి సాంకేతికపరమైన నైపుణ్యాలు ఉండని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Read also: Wives Eloped With Lovers: భర్తల్ని పని కోసం విదేశాలకు పంపి.. లవర్లతో భార్యలు జంప్
రైల్వే ప్రమాదాలపై కాగ్ ఇచ్చిన నివేదికలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. రైల్వేలో ఉన్నతస్థాయితోపాటు వివిధ కేటగిరిల్లో భారీ సంఖ్యలో ఖాళీలున్నాయని కాగ్ తెలిపిందని గుర్తు చేశారు. 2017-18, 2020-21 మధ్యకాలంలో జరిగిన 10 రైలు ప్రమాదాల్లో 7 కేసులు కేవలం పట్టాలు తప్పడం వల్లేనని కాగ్ తాతా నివేదికలోనూ ప్రత్యేకంగా పేర్కొందని ప్రధానికి రాసిన లేఖలో మల్లికార్జున్ ఖర్గే గుర్తు చేశారు. ఈస్ట్ కోస్ట్ లో ట్రాక్ నిర్వహణ ఊసే లేదన్నారు. కాగ్ సూచించిన ఈ హెచ్చరికలను ఎందుకు విస్మరించారని పేర్కొన్నారు. దేశంలో కోట్ల మంది ప్రయాణానికి కీలకమైన రైల్వేలపై మరింత విశ్వాసం కలిగించేందుకు ప్రయత్నించాలని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని రైల్వే మార్గాల్లో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, పరికరాలను అమర్చాలని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.