అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరి విధ్వంసం.. పంజాబ్ పై సన్‌రైజర్స్ ఘన విజయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో…
రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడిపోయింది. ఆకాశమంతా మేఘావృతమైపోయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. అకాల వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విశాదం చోటుచేసుకుంది. పదర మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగు పడటంతో సుంకరి సైదమ్మ (35) ఈదమ్మ, (55) అక్కడికక్కడే మృతి చెందారు.…
అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఆమె భర్త అమిత్ లోయాను అదుపులోకి తీసుకున్నారు. పింకీ సంపాదించిన డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత జరిగిన ఆర్థిక నష్టాలే ఈ విషాదానికి కారణమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. పింకీ సంపాదించిన రూ. 7 లక్షలను అమిత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా, లాభంతో మొత్తం రూ.…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ఇద్దరు కుమారులు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన వారు మౌనిక (26), మైథిలి (10), వినయ్ (7), అక్షర (9)గా గుర్తించారు. మృతదేహాల్లో మౌనికదే ఇంకా లభ్యం కాలేదు.
Electric Shock: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తుండగా 13 మంది విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో మరో యువకుడు వడ్డే కర్ణాకర్ (25) పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్ణాకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం…
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సంఘటన వల్ల ప్రభావితమైన ప్రజలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన కొడుకు ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కన్న కొడుకుని కొట్టి చంపాడు ఓ తండ్రి.. ఈ ఘటన చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెం గ్రామంలో జరిగింది. అయితే పాఠశాలలో ఓ అవార్డ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కొడుకు.. అక్కడ ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఇంటికి ఆలస్యంగా రావడంతో కొడుకు భానుని(14) తండ్రి సైదులు కొట్టి చంపాడు.
పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.. అనారోగ్యంతో ఓ వృద్ధుడు కన్నుమూస్తే.. మద్యం సేవించి కుమారుడు, అతడి బామ్మర్ది గంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది..
సంక్రాంతి వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాలిపటం ఎగరవేత విషాదాన్ని నింపింది. చంద్రగిరి పట్టణం బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు మరో బాలుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.