పాకిస్థాన్‌లో ఆమె గుర్తింపు కలిగిన నటి. దాదాపు 9 నెలల నుంచి ఆమె జాడ కనిపించలేదు. ఆమె ఊసు లేదు. పలుకు లేదు. కనీసం నా అన్నవాళ్లు కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. ఆమె ఎక్కడుందో కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతం ఆమె శవమై కనిపించింది. అసలేం జరిగింది? చనిపోయి కొన్ని నెలలైంది. ఇన్ని నెలలైనా ఎవరూ.. ఎందుకు పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఏంటి.. కోహ్లీ మరో టీ20 లీగ్ లో ఆడబోతున్నాడా..? నిజమెంత..?
హుమైరా అస్గర్ అలీ.. పాకిస్థాన్ నటి.. గత మంగళవారం అపార్ట్‌మెంట్‌లో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. అది కూడా అద్దె రావడం లేదంటూ యజమాని ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లాట్‌లోంచి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం చేసేందుకు కూడా వీలులేకుండా కుళ్లిపోయిందని వైద్యులు తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇరుగుపొరుగు వారిని విచారించారు. తమకు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కనిపించిందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో సెప్టెంబర్ నెల నుంచి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అంటే 2024, అక్టోబర్‌లో చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు.
ఇది కూడా చదవండి: Ramayana Update: ట్రోల్స్ బలైనా కాజల్.. మండోదరి పాత్ర నుంచి ఔట్ !
ఇక ఇన్ని రోజులు నటి మృతదేహాన్ని గుర్తించలేకపోవడంపై దర్యాప్తు అధికారులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే ఆమె నివసిస్తున్న అంతస్థులో ఎవరూ నివాసం ఉండడం లేదు. బాల్కనీ తలుపులలో ఒకటి మాత్రమే తెరిచి ఉందని.. ఈ నేపథ్యంలోనే ఆమెను గుర్తించలేకపోయినట్లు సమాచారం. ఇక ఇంటి అద్దె రాకపోవడంతో యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక దుర్వాసన వస్తుంటే.. ఇంట్లో వస్తువులు కుళ్లిపోయి ఉంటాయని ఇరుగుపొరుగు లైట్ తీసుకున్నారు. దీంతో ఇన్ని రోజులు దుర్ఘటన వెలుగులోకి రాలేదు.
ప్రస్తుతం నటి కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. కాల్ రికార్డుల ప్రకారం ఆమె అక్టోబర్‌లో చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆమె సోషల్ మీడియా పోస్టులు కూడా సెప్టెంబర్‌లో నిలిచిపోయాయి. దీనిని బట్టే ఆమె అక్టోబర్‌లో చనిపోయినట్లుగా అంచనా వేస్తున్నారు. నటి హుమైరా ఏడేళ్ల క్రితం లాహోర్ నుంచి కరాచీకి వచ్చింది. కుటుంబానికి పూర్తిగా దూరమై.. ఒంటరిగా ఉంటుంది. దాదాపు ఏడాదిన్నరగా కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేవు. ఇక నటి మృతదేహాన్ని కరాచీలోనే పాతిపెట్టాలని తండ్రి పోలీసులకు సూచించాడు.
హుమైరా అస్గర్ అలీ 2015లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. జస్ట్ మ్యారీడ్, ఎహ్సాన్ ఫరామోష్, గురు, చల్ దిల్ మేరే వంటి టెలివిజన్ షోల్లో సహాయక పాత్రలు పోషించింది. సినిమాల విషయానికొస్తే.. జలైబీ (2015), లవ్ వ్యాక్సిన్ (2021) చిత్రాల్లో కనిపించింది.