అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఆమె భర్త అమిత్ లోయాను అదుపులోకి తీసుకున్నారు. పింకీ సంపాదించిన డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత జరిగిన ఆర్థిక నష్టాలే ఈ విషాదానికి కారణమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. పింకీ సంపాదించిన రూ. 7 లక్షలను అమిత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా, లాభంతో మొత్తం రూ. 20 లక్షలకు పెరిగింది. అయితే అత్యాశతో ఆ మొత్తాన్ని మళ్లీ స్టాక్ మార్కెట్లో పెట్టి నష్టపోయాడు.
READ MORE: Pakistan: పాకిస్తాన్‌ని మందలించిన యూఎస్, సౌదీ.. దాయాది ముందు కాశ్మీర్ సహా 5 డిమాండ్లు
ఈ వ్యవహారంపై పింకీ, అమిత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. డబ్బుల విషయంలో పెరిగిన వివాదం, పోయిన డబ్బు కారణంగా పింకీ తీవ్ర మనస్తాపానికి గురైంది. గతేడాది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న పింకీ, అమిత్ ఇద్దరూ బాగా సంపాదించి, ఈ ఏడాది డిసెంబర్‌లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, అమిత్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిని తట్టుకోలేని పింకీ, చివరగా అమిత్‌కు కాల్ చేసి, ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు అమిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
READ MORE: YS Jagan: ప్రంపచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు..