కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ఇద్దరు కుమారులు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన వారు మౌనిక (26), మైథిలి (10), వినయ్ (7), అక్షర (9)గా గుర్తించారు. మృతదేహాల్లో మౌనికదే ఇంకా లభ్యం కాలేదు.
READ MORE: YS Jagan: ప్రంపచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మౌనిక పిల్లలతో కలిసి చెరువు వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మౌనిక మృతదేహాన్ని వెలికితీయడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో పండగ పూట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
READ MORE: UP Bans Meat Sale: రామ నవమి సందర్భంగా ఆలయాల వద్ద మాంసం అమ్మకాలు నిషేధం..