కొడుకు చనిపోయిన విషయం తెలియక మూడు రోజుల పాటు అంధకారంలోనే ఉండిపోయారు అంధ తల్లిదండ్రులు. మనసును కలచివేసే ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటుచేసుకుంది. కొడుకు మృతి నాగోల్‌లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియని పరిస్థితిలో మూడు రోజుల పాటు తిండి, తిప్పలు లేక ఆ అంధ వృద్ధ దంపతులు అవస్థలు పడ్డారు.
మృత్యువులోనూ ఆ రక్త సంబంధం వీడలేదు. తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క గుండె ఆగిపోయింది. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
బీహార్‌లోని సివాన్, సరన్, గోపాల్‌గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మాదాలవారి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. మొత్తం ఏడుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు చెరువులోకి సరదాగా స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో పాలడుగు దుర్గారావు, జే. వెంకటేష్ గా గుర్తించారు. మరో ఐదుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
జీవితాంతం తోడునీడలా కలిసి జీవిస్తామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలెదురొచ్చినా చివరి వరకు కలిసి ఉంటామని పెళ్లితో ముందడుగు వేస్తారు. ఈ జీవిత ప్రయాణంలో తన తోడును కోల్పోతే ఆ బాధ వర్ణణాతీతం. కేవలం దానిని అనుభవించేవారికే దాని విలువ తెలుస్తుంది. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాదు.
బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అల్లూరి జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.
ఆస్పత్రి యాజమాన్యం చేసిన తప్పు ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టుకునే అధికారుల తీరుతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాలలో 45 రోజుల పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. బాబు మృతికి కారణాన్ని తెలుసుకునేందుకు 10 రోజుల తర్వాత మృతదేహాన్ని బయటికీ తీసి పోస్టుమార్టం చేశారు. ఈ నెల 5న జ్వరంతో ఉన్న 45 రోజుల పసికందు దష్విక్ ని తల్లిదండ్రులు…