అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరి విధ్వంసం.. పంజాబ్ పై సన్‌రైజర్స్ ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో ఓపెనర్ అభిషేక్ శర్మ. అభిషేక్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కింగ్స్‌ను ఓడించాడు. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై తుఫాను సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తూ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు.
‘స్పిరిట్’ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే..?
ప్రభాస్ వరుస చిత్రాలో ‘స్పిరిట్’ ఒకటి. అయితే మరో అరడజను సినిమాలను లైన్ పెట్టాగా అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ మూవీ రిలీజ్‌కు రెడి అవుతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్, ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారట. అలాగే ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాల్లో ‘సలార్ 2’, ‘కల్కి 2898ad’ పార్ట్ 2 సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం వీటి తర్వాత వచ్చే సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు..
అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఒకరు మృతి
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. న్యూయార్క్‌లో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. న్యూయార్క్‌లో ఒక చిన్న విమానం కూలిపోవడంతో ఒకరు మరణించారు. అయితే, ఈ విమాన ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీకి దక్షిణంగా శనివారం మధ్యాహ్నం ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న ఒక చిన్న విమానం కూలిపోయి, ఒకరు మృతి చెందారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు తెలిపారు.
అమానవీయ ఘటన.. విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుమారుడు.. మృత దేహాన్ని నదిలో పడేసిన తండ్రి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రినన్న విషయం మరిచి విద్యుత్ షాక్ తో మృతి చెందిన కొడుకు మృత దేహాన్ని నదిలో పడేశాడు. సిర్పూర్ టి మండలం టోంకిని కి చెందిన జయేందర్( 19 ) పంట చేనుకు వేసిన విద్యుత్ కంచె (ఫెన్సింగ్ )తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే నేరం తనమీదకు వస్తుందని భయాందోళనకు గురైన తండ్రి మృత దేహాన్ని పెనుగంగ నదిలో పడేశాడు. ఆ తర్వాత కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మార్క్ శంకర్ తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులు..
ఈనెల 8న సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. మార్క్ చూసేందుకు ఈనెల 9న హుటాహుటిన వెళ్లారు పవన్‌కల్యాణ్. సింగపూర్ ఆస్పత్రిలో మార్క్‌కి నాలుగు రోజులపాటు చికిత్స జరిగింది. గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేశారట వైద్యులు. ఇక తాజా సమాచారం ప్రకారం మార్క్ శంకర్ కోలుకోవడంతో.. కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చారు పవన్. మార్క్ ను పవన్ కళ్యాణ్ ఎత్తుకొని.. ఎయిర్ పోర్టులో కనిపించారు. అటు తన భార్య కూడా పక్కనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. ముగ్గురు మహిళల మృతి
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిగి మండలం ధనాపురం సమీపంలో ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా పొడికొండ సిరా 544 జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులను రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మృతిచెందిన మహిళలను అలివేలమ్మ, ఆదిలక్ష్మీ, సకమ్మా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
హిట్ 3 సెన్సార్.. రన్ టైమ్ వివరాలు ఇవే
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరో నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు హిట్3లో నానినే హీరోగా నటిస్తు నిర్మిస్తున్నాడు. అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూడబోతున్నామని ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో తెలిసింది. కాగా ఈ సినిమా మే 1న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకుంది. సినిమాలో కాస్త వైలెన్స్, అలాగే హింసతో పాటు కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు కొన్ని హింసాపాళ్లు ఎక్కువగా ఉన్న సీన్స్ ను తొలగించారట. అలాగే ఈ సినిమాకు A సర్టిఫికెట్ ను జారీ చేసారు సెన్సార్ టీమ్. మొత్తంగా రెండు గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా ఫెయిల్ కాపీ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సారి నేచురల్ స్టార్ నుండి ఆడియెన్స్ షాక్ అయ్యే సినిమా వస్తదని సిల్వర్ స్క్రీన్ ఎరుపెక్కుతుందని సమాచారం. ఈ నెల 14న రాబోతున్న HIT 3 థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచనుందని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలకు రెడీ అవుతున్న హిట్ 3 రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కార్పెంటైన్ ఆయిల్ తాగి 21 నెలల చిన్నారి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఆదివారం దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పరిస్థితి ఒక విషాద ఛాయను సంతరించుకుంది. నిర్లక్ష్యపు నిమిషాలు అమూల్యమైన ప్రాణాన్ని బలిగొన్నాయి. కేవలం 21 నెలల బాలుడు కార్పెంటైన్ ఆయిల్‌ను మంచినీళ్లుగా పొరపడి తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన గ్రామస్థులను విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘటన ధన్వాడ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోడ మమత, ఆమె భర్త నరేష్ కుటుంబంలో చోటు చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు సుహాన్ తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అప్పటిదాకా ఆనందంగా ఉన్న చిన్నారి జీవితంలో ఒక్క క్షణమే ముసురుకోలేని చీకటిగా మారింది.