Traffic Alert: సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి.
రాజధాని హైదరాబాద్‌లో వర్షం ధాటిగా కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి పటాన్‌చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, గాజులరామారం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన కొనసాగుతోంది. కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చందానగర్, జీడిమెట్లలో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మామూలుగా ఉన్నప్పటికీ, సాయంత్రం వచ్చిన వర్షం నగర జీవనాన్ని దెబ్బతీసింది.
పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే ‘వినాయక చవితి’గా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. గణేష్ చతుర్థి ఉత్సవాలకు పల్లెలు, పట్టణాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల మండపాల నిర్మాణాలు పూర్తి కాగా.. గణేష్ విగ్రహాలు కూడా చేరుకున్నాయి. గణేష్ విగ్రహాల కొనుగోలు సందర్భంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈరోజు ఉదయం పంజగుట్ట చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.…
HYD : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 1/12లో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వర్షాల ప్రభావంతో రోడ్డు ఆకస్మాత్తుగా కుంగిపోవడంతో, ఆ మార్గంలో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ గుంతలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ , క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , జీహెచ్ఎంసీ సిబ్బంది గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.…
Hyderabad Rains : సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి, దీనితో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది, నీరు నిలిచిపోయింది. తక్కువ వ్యవధిలో 50 మి.మీ వర్షపాతంతో ప్రమాదకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు టి బాలాజీ హెచ్చరిక జారీ చేశారు. పౌరులు ఇంటి లోపలే ఉండాలని కోరారు. Hitech City Railway Station: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇలా మారిపోతుందని ఊహించారా..? సాయంత్రం కురిసిన…
Hyderabad Rains Trigger Massive Traffic Jam: తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర…
Hyderabad Rains : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad Rains) నగరంలో శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. అమీర్‌పేట, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కొత్తపేట, రాజేంద్రనగర్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి వంటి పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం మరో గంటపాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) వెల్లడించింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై నీరు…
Heavy Rain: హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం బీభత్సం సృష్టిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, అమీర్‌పేట, టోలిచౌకి, బీరంగూడ, పటాన్ చెరువు, బీహెచ్ఈఎల్, షేక్ పేట్, మెహిదీపట్నం, లంగర్ హౌస్, కోఠి, గచ్చిబౌలి, అత్తాపూర్ లాంటి ప్రాంతాల్లో వర్షానికి ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది.
హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం కురిస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, మెహిదీపట్నం, టోలిచౌకీ, మాసబ్‌ట్యాంక్, నాంపల్లిలో వర్షం పడుతుంది.