Hyderabad Rains : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad Rains) నగరంలో శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. అమీర్‌పేట, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కొత్తపేట, రాజేంద్రనగర్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి వంటి పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం మరో గంటపాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) వెల్లడించింది.
భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకోవడంతో GHMC, జలమండలి, హైడ్రాఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Partha Sarathy: పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..? మంత్రి సంచలన వ్యాఖ్యలు..
రానున్న రెండు గంటల్లో జగిత్యాల, మెదక్, మంచిర్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని HMD తెలిపింది. ఈ నెల 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Attempted R*ape: కళాశాలలో దింపుతానని నమ్మించి.. బాలికను బైక్ పై ఎక్కించుకుని అత్యాచారయత్నం