HYD : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 1/12లో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వర్షాల ప్రభావంతో రోడ్డు ఆకస్మాత్తుగా కుంగిపోవడంతో, ఆ మార్గంలో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ గుంతలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ , క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , జీహెచ్ఎంసీ సిబ్బంది గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
71 National Awards : అసలు షారుక్ ఖాన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఎలా ఇస్తారు : నటి ఊర్వశి
అధికారుల ప్రకారం, కుంగిన ప్రాంతం కింద నాళా పైప్‌లైన్ ఉండటం , భారీ వర్షం కారణంగా నేల బలహీనపడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు కుంగిపోవడంతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాటర్ ట్యాంకర్‌ను బయటకు తీయడానికి ట్రాఫిక్ పోలీసులు , మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేసి మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.