Hyderabad Rains : ఇది మన అమీర్‌పేటే..!
- సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షాలు
- అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
- తక్కువ వ్యవధిలో 50 మి.మీ వర్షపాతం
- ప్రమాదకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
- కురిసిన వర్షానికి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతంలో భారీగా నిలిచిన నీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Rains : సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి, దీనితో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది, నీరు నిలిచిపోయింది. తక్కువ వ్యవధిలో 50 మి.మీ వర్షపాతంతో ప్రమాదకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు టి బాలాజీ హెచ్చరిక జారీ చేశారు. పౌరులు ఇంటి లోపలే ఉండాలని కోరారు.
Hitech City Railway Station: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇలా మారిపోతుందని ఊహించారా..?
Also Read
సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు నడుంలోతు మేర నీళ్లు రోడ్డుపై నిలచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అయితే.. దీనికి సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ గా మారాయి.
ఇదిలా ఉంటే.. పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, దబీర్‌పురా, బహదూర్‌పురా, కాలాపతేర్, రామస్వామిగంజ్, ఛత్రినాక, మల్లేపల్లి వంటి పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. భారీ వర్షాలకు హైదరాబాద్ రోడ్లు జలమయమయ్యాయి. తెలంగాణ వెదర్‌మ్యాన్ తీవ్ర ఉరుములు మెరుపులతో కూడిన హెచ్చరిక జారీ చేశారు. వరదలు పోయిన రోడ్ల గుండా ప్రయాణించడానికి వాహనదారులు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. పాదచారులు రోడ్డు పక్కనే ఉండి, నీరు తగ్గే వరకు వేచి చూస్తున్నారు. ఓల్డ్ సిటీలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి.
Ameerpet~Panjagutta stretch completely flooded 🌊⚠️ Heavy waterlogging everywhere — Stay safe, #Hyderabad#Hyderabadrains pic.twitter.com/VprKfSZSmR
— Hyderabad Rains (@Hyderabadrains) August 4, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..