రాజధాని హైదరాబాద్‌లో వర్షం ధాటిగా కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి పటాన్‌చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, గాజులరామారం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన కొనసాగుతోంది. కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చందానగర్, జీడిమెట్లలో భారీ వర్షం కురిసింది.
Singer Chinmayi : లైంగిక వేధింపులను ప్రోత్సహించడమే.. జానీ మాస్టర్ పై చిన్మయి సంచలనం
పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్‌లోనూ వర్షపడింది. అయితే.. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. మరో గంటలో సెంట్రల్, వెస్ట్ హైదరాబాద్ అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగిపోయాయి. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైడ్రా, GHMC బృందాలు రంగంలోకి దిగి వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో నీటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇదే సమయంలో నిజామాబాద్, సిద్ధిపేట, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తూ వాతావరణం చల్లగా మారింది.
Iran Nuclear Program: ట్రంప్‌కు ఇరాన్ షాక్ .. ‘అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం’