Traffic Alert: సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. ప్రతీసారి ఉన్నట్లే ఈసారి కూడా టోల్ గేట్ల వద్ద రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా టోల్ గేట్స్ దగ్గర వాహనాల తాకిడి భారీగానే ఉంది. పంతంగి, కీసర టోల్ గేట్స్ దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. దీంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ గేట్లను అందుబాటులో తెచ్చి వాహనాలను పంపిస్తున్నారు.
Read Also: Hyderabad: ప్రాణం తీసిన వేగం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..
అయితే, విజయవాడ నుంచి ఇప్పటి వరకూ అన్ని జిల్లాలకూ లక్షకు పైగా ప్రయాణికులు వెళ్లగా.. ఈరోజు రాత్రిలోపు 3 లక్షలు దాటుతారని అధికారులు అంచనా వేశారు. అన్ని రూట్లలోనూ అత్యధికంగా రద్దీ పెరిగింది. ఇప్పటికే, ఏపీఎ్ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు SOLD OUT చూపిస్తున్నాయి. దీంతో అదనపు బస్సులకు రద్దీ పెరిగింది. మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయి. ప్రయాణికుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. కాకినాడలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని, అధికంగా సీట్లు ఏర్పాటు చేసిన బస్సులపై కేసులు నమోదు చేసి ఫైన్ విధించారు. పండగ సీజన్ కావడంతో ఫిట్ నెస్ లేని బస్సులను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అధిక ఛార్జీలపై ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.