ప్రతి ఆదివారం రోజున సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్ రోడ్లను మూసేస్తున్నట్లు ఇప్పటికే పోలీసు అధికారులు ప్రకటించారు. కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతించేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్గంలో ప్రయాణం చేసే వాహనాలను దారిమళ్లించనున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సందర్శకులకు ట్యాంక్‌బండ్ చివర పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్టు ట్రాఫిక్…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కేసులు వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. ఏపీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పోలిస్తే, విశాఖలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్‌లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన తరువాత విశాఖ బీచ్‌కు తాకిడి పెరిగింది. శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో బీచ్‌కు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఒక్క విశాఖ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశాఖ బీచ్‌కు పర్యాటకులు తరలి వస్తుండటంతో…
కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైని ముస్సోరిలోని కెంప్టీ జలపాతాన్ని సందర్శించేందుకు భారీగా తరలి వచ్చారు. కెంప్టీ జలపాతం కింద పర్యాటకు పోటీలుపడి మరీ స్నానాలు చేశారు. …
అందాల అరకు లోయ చాలా కాలం తరువాత పర్యాటకులతో కళకళలాడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు. ఆంక్షలు క్రమంగా సడలిస్తుండటంతో అన్ని రంగాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. మూడు నెలల క్రితం మూతపడిన పర్యాటక రంగం తిరిగి తెరుచుకున్నది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు వ్యాలీకి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. Read: తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెష్ వారాంతపు సెలవులు కావడంతో అరకు వెళ్లి అక్కడ సేదతీరేందుకు పర్యాటకులు…
కరోనా కారణంగా అనేక దేశాల్లో టూరిజం పూర్తిగా నష్టపోయింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. నష్టపోయిన ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొన్ని దేశాలకు పర్యాటకరంగం నుంచి అధికమొత్తంలో ఆదాయం వస్తుంది. అలాంటి దేశాలు పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలోకి తీసుకొచ్చేందుకు త్వరితగిన చర్యలు తీసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ గ్రీన్ వీసా విధానాన్ని అమలులోకి తీసుకురాగా, ఈజిప్ట్ ఈ వీసాను అమలులోకి తీసుకొచ్చింది. ఈజిప్టుకు పర్యాటకం నుంచే అధికఆదాయం లభిస్తుంది. కరోనా కారణంగా…
వైజాగ్ అంటేనే టూరిజానికి కేరాఫ్ అడ్రస్. బీచ్, అరకు లోయలు, ఏజెన్సీ ప్రాంతాలు, జలపాతాల సందడి… టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సాధారణ రోజుల్లో కంటే సీజనల్ డేస్ లో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. అలాంటి టూరిజంపై కరోనా ప్రభావం పడింది. విశాఖలో ట్రావెల్స్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 పైగా చిన్నా చితకా ట్రావెల్ ఏజెన్సీ లు ఉన్నాయ్. కరోనా వల్ల గత ఏడాది నుంచి వ్యాపారం సాగకపోవడంతో…
సమ్మర్ వచ్చింది అంటే పర్యాటకులు హిల్ స్టేషన్‌లకు క్యూలు కడుతుంటారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన హిల్ స్టేషన్లలో ఒకటి సిమ్లా. గతేడాది కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో సమ్మర్ సమయంలో పర్యాటకు పెద్దగా కనిపించలేదు. ఈ ఏడాది కూడా మార్చి నుంచి దేశంలో సెకండ్ వేవ్ మహమ్మారి విలయతాండవం చేసింది. దీంతో ఈ ఏడాది జూన్ వరకు హిమాచల్ ప్రదేశలో పలు ఆంక్షలు విధించారు. అయితే, కారోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో సిమ్లాలో ఆంక్షలు సడలించారు. ఉదయం…
ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి కోలుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సందర్శక ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు హోటల్స్ బుకింగ్‌లో డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ‘టూరిస్ట్ ఇన్సెంటివ్ కూపన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా పర్యాటకుల హోటల్స్ బుకింగ్‌లో రూ.1000 లేదా 25శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ డిస్కౌంట్ కూపన్ పొందాలంటే ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు రోజులు ఉండేలా బుకింగ్…