సమ్మర్ వచ్చింది అంటే పర్యాటకులు హిల్ స్టేషన్‌లకు క్యూలు కడుతుంటారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన హిల్ స్టేషన్లలో ఒకటి సిమ్లా. గతేడాది కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో సమ్మర్ సమయంలో పర్యాటకు పెద్దగా కనిపించలేదు. ఈ ఏడాది కూడా మార్చి నుంచి దేశంలో సెకండ్ వేవ్ మహమ్మారి విలయతాండవం చేసింది. దీంతో ఈ ఏడాది జూన్ వరకు హిమాచల్ ప్రదేశలో పలు ఆంక్షలు విధించారు. అయితే, కారోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో సిమ్లాలో ఆంక్షలు సడలించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. పాస్‌లు, నెగెటీవ్ సర్టిఫికెట్లు అవసరం లేకపోవడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు సిమ్లాకు పయనం అయ్యారు. దీంతో ఆదివారం రోజున పెద్ద ఎత్తన పర్యాటకులు సిమ్లాకు రావడంతో పర్యాను వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.