ప్రతి ఆదివారం రోజున సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్ రోడ్లను మూసేస్తున్నట్లు ఇప్పటికే పోలీసు అధికారులు ప్రకటించారు. కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతించేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్గంలో ప్రయాణం చేసే వాహనాలను దారిమళ్లించనున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సందర్శకులకు ట్యాంక్‌బండ్ చివర పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌ను టూరిజం కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. కరోనా మహమ్మారి తరువాత పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు. హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వందలాది మంది వీకెండ్స్ లో వస్తుంటారు.
Read: టీటీడీ కీలక నిర్ణయం… ఘాట్‌రోడ్డులో ఇకపై ఆ వాహానాలు…