Virat Kohli in Top Place: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్‌లో లేడు. దీంతో జట్టులో అతడి స్థానంపై మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేసే పరిస్థితి నెలకొంది. అయితే మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయకపోయినా టీమిండియా తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మాత్రం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2019 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. అప్పటినుంచి ఇప్పటివరకు…
ఈసారి ఐపీఎల్ లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. సీజన్లోకి ప్రవేశించిన జట్లు విలక్షణ ఫలితాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఏ సీజన్‌లో కూడా ఒక జట్టు తొలి 9 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించిన చరిత్ర లేదు. కానీ ఈసారి గుజరాత్ టైటాన్స్ తన సత్తా చాటింది. మరోసారి సమష్టి ప్రదర్శనతో చక్కటి ఆటతీరు కనబర్చిన గుజరాత్ వరుసగా ఐదో విజయాన్ని అందుకుని వాహ్ వా అనిపించింది. తొలి మూడు మ్యాచ్‌లు గెలిచాక…
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20 సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేసింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకుల్లోనూ టీమిండియా అదరగొట్టింది. ఈ సిరీస్ విజయంతో 269 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి టీమిండియా అగ్రస్థానానికి చేరింది. దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరడం విశేషం. అంతకుముందు 2016 ఫిబ్రవరిలో చివరిసారిగా ధోనీ సారథ్యంలో భారత్ అగ్రస్థానానికి చేరింది. మరోవైపు స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం.…
కరోనాపై పోరులో భారత్ తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో వంద కోట్ల టీకాల మైలురాయిని దాటేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. అవకాశాలను, వనరులను వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో 5.01 కోట్ల డోసుల టీకాలను ఇచ్చారు. సోమవారానికి అది మరింత పెరగనుంది. ఇప్పటికే దేశంలో ఎక్కువ మంది ప్రజలకు రెండు డోసులు టీకాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉంది. తాజాగా ఐదు కోట్ల డోసులు పూర్తయ్యాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే మిగతా పెద్ద…