విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ వీసాల మోసం.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెట్టారు. నకిలీ ఆఫర్ లెటర్లు, నకిలీ వీసాలతో నిరుద్యోగులను మోసం చేశారు. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాలనుకున్నారు. కానీ బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలి..డాలర్లు జేబులో వేసుకోవాలో.. డాలర్లు జేబులో వేసుకోవాలి…కోట్ల రూపాయలు కూడ పెట్టాలని ఎవరైనా కలలుకంటారు.. అంతేకాదు దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. విదేశాలకు కనీసం దొడ్డిదారిలోనైనా వెళ్లాలని ఆలోచిస్తారు. అమెరికాకు వెళ్లాలంటే డంకీ రూటు సైతం ఎంచుకుంటారు… యువత ఆశలను క్యాష్ చేసుకుంటున్న బ్రోకర్లు.. కుప్పలు తిప్పలుగా పుట్టుకు వస్తున్న కన్సల్టెంట్ సంస్థలు.. నకిలీ ఉద్యోగ అవకాశాలు ఆశ చూపించి మోసం..అయితే యువత ఆశలను బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు.
నేడు మధురైలో మురుగన్ భక్తుల సమ్మేళనం.. హాజరుకానున్న యోగి, పవన్ !
హిందూ మున్నణి సంస్థ ఆధ్వర్యంలో నేడు ‘మురుగన్ మహా భక్త సమ్మేళనం’ జరగనుంది. మధురైలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్త సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు హిందూ మున్నణి సంస్థ అధ్యక్షుడు కాడేశ్వర సుబ్రహ్మణ్యన్ తెలిపారు. అమ్మ తిడల్, పాండి కొవిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ భక్త సమ్మేళనానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. మురుగన్ మహా భక్త సమ్మేళనం కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా సేవ్ టెంపుల్స్ భారత్ జాతీయ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. మహా సమ్మేళనం నేపథ్యంలో గత 15 రోజులుగా యోగి, పవన్, బీజేపీ నేతలు ఉపవాసం ఉంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సనాతనధర్మ హిందూ బంధువులు కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారుల ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలు ఉంటాయి.
‘మిత్ర మండలి’ నుండి మొదటి సింగిల్ విడుదల.. !
టాలీవుడ్ యంగ్ నటుడు ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిత్ర మండలి’. విజయేందర్ స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకక్కిన ఈ సినిమాలో వెనెల్లా కిషోర్, సత్య, విటివీ గణేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనదైన కామెడీ టైమింగ్, పంచులతో అలరించే ప్రియదర్శి ఈ మూవీలోనూ మరోసారి కామెడీతో ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యంతం నవ్వులతో టీజర్ ఆకట్టుకుంది.
శ్రీశైలంలో భక్తులకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ కష్టాలు.. పట్టించుకోని దిగ్గజ టెలికాం సంస్థలు!
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంను సందర్శించే భక్తులకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ కష్టాలు తప్పడం లేదు. శనివారం (జూన్ 21) సాయంత్రం నుండి బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మినహ ఇతర సెల్‌ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేక ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, జియో వినియోగదారులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గత మూడు నెలలుగా ఎయిర్‌టెల్, జియో వినియోగదారులకు శ్రీశైలంలో సిగ్నల్స్ సమస్య ఎదురవుతోంది. భక్తులు ఎందరో ఫిర్యాదు చేసినా.. ఈ రెండు టెలికాం సంస్థలు మాత్రం చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. శ్రీశైలం స్థానికులు, భక్తులు చాలా మంది ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్ వాడుతున్నారు. ఇక్కడ నిత్యం సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గత మూడు నెలలుగా వినియోగదారులకు శ్రీశైలంలో సిగ్నల్స్ సమస్య ఎదురవుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో శ్రీశైలంకు వచ్చిన భక్తులు సిగ్నల్స్ లేక.. తమ కుటుంబీకులు ఎక్కడ వున్నారో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఎయిర్‌టెల్, జియో సంస్థలు మెరుగైన సేవలు అందించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి
ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించిందని మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. “ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్” అనే కీలక అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని శనివారం ఆయన “ట్రూత్ సోషల్” వేదికగా తెలిపారు. “ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై మేం చేసిన దాడి పూర్తి విజయవంతంగా ముగిసింది. మా బాంబర్లు ఫోర్డోపై పూర్తి స్థాయిలో పేలోడ్‌తో దాడి చేశాయి. ప్రస్తుతం మా విమానాలన్నీ ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చాయి. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఈ సాహసోపేత ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన మా వీర సైనికులకు హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి ఆపరేషన్‌ను ప్రపంచంలో మరే దేశ సైన్యం కూడా చేయలేదని గర్వంగా చెబుతున్నాను.
సూర్య – వెంకీ అట్లూరి మూవీ పై క్రేజీ అప్ డేట్..
తమిళ స్టార్ హీరో సూర్య, క్లాస్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హార్ట్‌ఫుల్ ఎమోషన్లకు పేరుగాంచిన వెంకీ, ఈసారి పూర్తిగా కొత్త కోణంలో, మాస్ యాంగిల్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశ వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ భారీ సెట్ వేసి, సూర్యపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సీన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఇదే సెట్లో గతంలో ‘గుంటూరు కారం’ చిత్రీకరణ జరగడం విశేషం.
ఐటీ ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని జెప్టో!
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘జెప్టో’ డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఓ ఐటీ ఉద్యోగిని కిరాణా సామాగ్రి డెలివరీ ఇచ్చిన అనంతరం.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అత్యాచారయత్నం చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో.. డెలివరీ బాయ్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు చేయగా.. పోలీసులు డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నైలోని కుబేరన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మడిపాక్కంకు చెందిన మహిళా ఐటీ ఉద్యోగిని జెప్టో యాప్ ద్వారా కిరాణా సామాగ్రికి ఆర్డర్ చేసింది. గోపీనాథ్ అనే డెలివరీ బాయ్ కిరాణా వస్తువులను డెలివరీ చేశాడు. సెల్‌ఫోన్ చార్జింగ్ లేదని, ఎమర్జెన్సీ అని చెప్పి.. కాసేపు ఛార్జింగ్ పెట్టుకుంటానని కోరడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గోపీనాథ్‌ను ఇంటి లోపలకి అనుమతించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై గోపీనాథ్ అత్యాచారయత్నం చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో డెలివరీ బాయ్ ఇంట్లో నుంచి పరారీ అయ్యాడు.