సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో వార్షికోత్సవ సభ.. ఎల్లుండే
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ సభ ఎల్లుండి జరగనుంది. సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్నది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ.. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యాలు.. పి 4పై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఎమ్మెల్యేలు మంత్రులు మొదటి వార్షికోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ నెల 12 న జరగాల్సిన కూటమి మొదటి వార్షికోత్సవ సభ అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో వాయిదా పడింది.
విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు కైవసం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో ఈ కార్యక్రమం ప్రతిష్ట మరింత పెరిగింది. పదేళ్లుగా ప్రపంచ ప్రజలందరూ జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 11వ ఏడాది కార్యక్రమం ఈసారి ఏపీకి ప్రతిష్టాత్మకమైంది. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వేదికగా యోగాడే జరిగింది. ఈ విశేష కార్యక్రమాన్ని ఏ.పి.ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిర్వహించింది.
ఎన్ని కుట్రలు చేసినా.. రేవంత్ రెడ్డికి తలవంచం నిలదీస్తూనే ఉంటాం
హుజురాబాద్MLA పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే… కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే సుబేదారి పోలీస్ స్టేషన్‌కు బీఆర్‌ఎస్ లీగల్ టీం చేరుకుంది. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా… రేవంత్ రెడ్డికి తలవంచం నిలదీస్తూనే ఉంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తన అరెస్ట్ అని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి నోటీసు ఇవ్వకుండా ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేయడం అక్రమం అని కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కుట్రలు – అక్రమ కేసులు ఎన్ని పెట్టినా.. నిజాయితీ తలవంచదన్నారు కౌశిక్‌రెడ్డి.
ఊరించి.. ఉసూరుమనిపించిన గోల్డ్ ధరలు.. నేడు మళ్లీ పెరిగాయ్
నిన్న భారీగా తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు నేడు ఉసూరుమనిపించాయి. ఇవాళ తులం పసిడి ధర రూ. 270 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,075, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,235 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగింది. దీంతో రూ. 92,350 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగింది. దీంతో రూ. 1,00,750 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగింది. దీంతో రూ. 92,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 270 పెరిగింది. దీంతో రూ. 1,00,900 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
కసాయి తల్లి.. ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది
అమ్మ దైవంతో సమానం. నవమోసాలు కని పెంచి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతుంది. అలాంటి కన్న తల్లులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ, ప్రస్తుత రోజుల్లో కొంతమంది తల్లులను చూస్తుంటే.. కంటేనే అమ్మాని అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా అని అనాల్సిన పరిస్థితి దాపరించింది. అమ్మతనానికే మాయని మచ్చగా తయారవుతున్నారు కొందరు తల్లులు. పరాయి వ్యక్తుల మోజులో పడి కన్న బిడ్డలను సైతం చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రియుడితో హనీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది ఓ కసాయి తల్లి.
పాక్ నీటి కొరతకు సిద్ధంగా ఉండాలి.. సింధూ జలాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఈ ఒప్పంద నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా భారత నీటిని వాడుక చేసిందని, ఇకపై ఆ దేశం నీటి కొరతకు ఎదురుకావాల్సిందేనని హెచ్చరించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒప్పందాలను తులతూలకుండా రద్దు చేయలేమని, కానీ సింధూ ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు మాత్రం భారత్‌కు ఉంది. అదే చేశామని అని వివరించారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం శాంతి, పురోగతి లక్ష్యాలతో ఏర్పడిందని, అయితే పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘించిన వేళ భారత నిర్ణయం తగినదేనని పేర్కొన్నారు.
యోగాంధ్ర సూపర్ హిట్.. హిస్టరీ క్రియేట్ చేయగలిగాం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. విశాఖ కలెక్టరేట్ లో యోగాడే గ్రాండ్ సక్సస్ పై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులుతో సమీక్షించారు. విశాఖతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై చర్చించారు. పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సిఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్నివిభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు.
సామాన్యుడైన.. దేశాధినేతైనా.. ఎవరి ఫోన్కీ భద్రత లేదా?
స్మార్ట్‌ఫోన్.. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. పొద్దున లేచిన తర్వాత ముందుగా మొబైల్ ఫోన్ చూసిన తర్వాతమే మంచం దిగుతున్నారు. క్షణం ఫోన్ కనబడకపోతే ఏదో కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఫోన్‌లోనే ఉంటున్నారు. కానీ ఫోన్ సేఫ్టీ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. ఫోన్లో డేటా డిలీట్ చేస్తే ఏమీ కాదని కొందరు భ్రమపడుతున్నారు. కానీ అదే ఫోన్ ఐపీ ద్వారా మొత్తం సమాచారం రికవరీ చేయొచ్చు. మనం అత్యాధునిక సాంకేతిక యుగంలో బతుకుతున్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా కుదరదు. ఏ పని చేయాలన్నా ఆన్ లైన్ లో చేయాల్సిందే. ఓవైపు ఇంటర్నెట్ సాయంతో.. పనులు వేగవంతంగా జరుగుతున్నా.. డేటా చౌర్యం కూడా ఈజీగా జరిగిపోతోంది. మన స్మార్ట్ ఫోన్ నుంచి మనకు తెలియకుండానే పర్సనల్ డేటా దొంగిలిస్తున్నారు. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఏవీ సేఫ్ కాదు. ఏదో మెయిల్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే.. మొత్తం డేటా అంతా సైబర్ కేటుగాళ్లకు వెళ్లిపోతుంది.ఇక పబ్లిక్ కంప్యూటర్లు, ఆఫీస్ సిస్టమ్ ల గురించి చెప్పాల్సిన పని లేదు. పర్సనల్ పరికరాల్లో ఉన్న డేటాకే దిక్కులేనప్పుడు.. ఇక పబ్లిక్ యూజ్ లో ఉన్నవాటి గురించి చెప్పేదేముంది.
ఏపీలో రానున్న 48 గంటల్లో వర్షాలు.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు
ఈ ఏడాది ముందుగాను రుతుపవనాలు పలకరించడంతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీ, తెలంగాణలో వానలు దంచికొట్టాయి. కాగా కొద్ది రోజులుగా వానలు ముఖం చాటేయడంతో అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కప్పతల్లి ఆటలాడుతూ వరుణ దేవుడిని కరుణించమని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రతిజ్ఞ.. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పోరుకు ఒక ముఖ్యమైన అడుగు వేయడంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూన్ 21 నుండి 26 వరకు జరగనున్న ఈ వారోత్సవాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవ లక్ష్యం.