నేడు విశాఖలో యోగాంధ్ర వేడుకలు. RK బీచ్‌లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, ప్రముఖులు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న యోగాంధ్ర వేడుకలు.
నేడు ప్రపంచ యోగా దినోత్సవం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యోగా డే వేడుకలు.
నేడు తెలంగాణలో ఘనంగా యోగా డే వేడుకలు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో యోగా డే వేడుకలు. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు.
మహబూబ్ నగర్ జిల్లా : జూరాలకు వరద ప్రవాహం. 7 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో :86,584 వేల క్యూ సెక్కులు. ఔట్ ఫ్లో : 83,772 వేల, క్యూ సెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం :1045 ఫీట్లు, ప్రస్తుత నీటిమట్టం :1041.896 ఫీట్లు . పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ: 7.778 టీఎంసీలు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,470 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,090లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,20,000 లుగా ఉంది.
నేడు తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు. మధ్యాహ్నం 3.45 గంటలకు ఫలితాలు విడుదల. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్న ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్‌రెడ్డి.
ఏపీకి వర్ష సూచన. మూడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌తోపాటు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం.