ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆయిల్ ధరలు.. భారత్పై ఎఫెక్ట్!
ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. నిన్న ( జూన్ 22న) హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమ ఆసియా దేశాలతో భారత దౌత్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్‌కు వెళ్లే ఎగుమతులు భారీగా కూడా భారీగా తగ్గిపోయాయి. ఇరు దేశాలకు కీలక మార్గం అయిన హర్మూజ్ జలసంధి మూత పడుతుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలు 80 డాలర్ల ఎగువకు చేరే అవకాశం ఉంది. ఈ వార్తల నేపథ్యంలో గత 5 నెలల్లో చమురు ధరలు సోమవారం (జూన్ 23న) గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7 శాతం పెరిగి 79.12 డాలర్లకు చేరుకోగా.. ఈ పరిణామం ఆసియా మార్కెట్లపై చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరోవైపు, దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. అయితే, ప్రస్తుతానికి నిల్వలు ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించడంతో ఊరటనిచ్చినా.. ఈ యుద్ధం మరికొన్ని రోజుల పాటు కొనసాగితే.. భారత్ పై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
గోల్డ్ మార్కెట్‌లో 650గ్రా.ల బంగారంతో వ్యక్తి పరార్..!
ఈ మధ్యకాలంలో ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించే వారి సంఖ్య రోజురోజుకు తిరుగుతోంది. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి దొరికినంత దోచేసుకొని వెళ్లే వ్యక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్ర వ్యాపార రాజధానిగా పేరు పొందిన విజయవాడలో ఒక ఘరానా మోసం బయటపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని వన్ టౌన్ శివాలయం వీధిలో గోల్డ్ వ్యాపారం చేస్తున్న ఏనుగుల వినోద్ పరార్ కావడం తీవ్ర చర్చనీయాంసంగా మారింది. అయితే, ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ పంట కాలువ రోడ్డులో ఏనుగుల చంద్రరావు కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. ఏనుగుల చంద్రరావు గత 50 సంవత్సరాలుగా విజయవాడ శివాలయం వీధిలో రజిని గోల్డ్ షాప్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఏనుగుల చంద్రరావు కి ముగ్గురు కుమారులు. ముగ్గురు కుమారులు తండ్రి వద్దనే గోల్డ్ వ్యాపారం చేస్తున్నారు. ఏనుగుల చంద్రరావుకు విజయవాడ గోల్డ్ మార్కెట్ లో మంచి పేరు ఉంది. అయితే ఆయన రెండో కుమారుడు ఏనుగుల వినోద్ తండ్రికి ఉన్న పేరును ఉపయోగించుకొని వ్యాపారస్తులను మోసం చేసాడు.
గోరేగావ్ ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం..!
ముంబైలోని ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం ఓ సీరియల్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదని వారు తెలిపారు. అనుపమాలోని టెంట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. దానితో వెంటనే గోరేగావ్ (తూర్పు) ప్రాంతం లో ఉన్న ఫిల్మ్ సిటీలోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరిలో ఉన్న మరాఠీ బిగ్ బాస్ సెట్ వెనుక ఉదయం 6.10 గంటలకు జరిగింది. అయితే అక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇక సంఘటన జరుగుతున్న సమయంలో నాలుగు అగ్నిమాపక యంత్రాలు, అనేక పెద్ద నీళ్ల ట్యాంకర్లను సంఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక చర్యలు జరుగుతున్న ప్రదేశంలో అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ సహా మరో ముగ్గురు స్టేషన్ అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు కూడా సమాచారం లేదని ఓ అధికారి తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారతదేశానికి ప్రధాన ఆస్తి.. నరేంద్ర మోడీనే
పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కోసం ఐదు దేశాల్లో పర్యటించి ఇటీవల తిరిగి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మోడీ శక్తి, చైతన్యంమే ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రధాన ఆస్తిగా మిగిలిపోయాయని తెలిపారు. కానీ, దానికి మరింత మద్దతు అవసరం అని ఓ జాతీయ న్యూస్ కథనానికి రాసిన కాలమ్‌లో వెల్లడించారు. అయితే, పాక్ దురాక్రమణపై ప్రచారం ప్రపంచ వేదికపై భారతదేశ ఐక్యతను చాటి చెప్పిందని ఆయన నొక్కి చెప్పారు. ఐక్యత శక్తి, స్పష్టమైన కమ్యూనికేషన్, సమర్థత, వ్యూహాత్మక విలువలు భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టాయని శశిథరూర్ రాసుకొచ్చారు.
కొత్త జీవితం మొదలై రెండు నెలలే.. వేధింపులతో నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య..!
ఇది ప్రేమ పెళ్లి కాదు. కానీ, ఒక కొత్త జీవితంపై కలలు కంటూ అడుగుపెట్టిన నవ వధువు.. ఆ జీవితం బంధనంగా మారుతుందని ఊహించలేకపోయింది. భర్త వేధింపులతో ఆమె ఉక్కిరిబిక్కిరై, చివరకు ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు KPHB లో ఓ ప్రైవేట్ షాపులో సెల్స్ మాన్‌గా పని చేస్తుంటాడు. అతడు, పూజిత అనే యువతిని ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండు నెలలకే పూజిత తన ప్రాణాలను తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఈ మృతిచెందిన నవ వధువు భర్త శ్రీనివాస్ వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పూజితకు గతంలో కొన్నాళ్ల పాటు బంధువులతో కలిసి ఒక ఫంక్షన్ సమయంలో తీసిన ఓ వీడియోలో కూల్ డ్రింక్ తాగుతున్న దృశ్యం ఉంది. ఆ వీడియోను తీసుకుని, శ్రీనివాస్ ఆమెను తీవ్రంగా శారీరకంగా, మానసికంగా వేధించాడట. ఇదే కాదు, ఆ వీడియోను వాట్సాప్‌లో పంచుతూ కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ వీడియోను అడ్డంగా పెట్టుకుని అదనపు కట్నం తీసుకురావాలని పూజితపై తీవ్ర ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.
అది ఫేక్ వీడియో.. ఎక్కడికైనా వెళ్లి టెస్ట్ చేసుకోమనండి..
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కేసు నందైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కారణమైన ఘటనకు సంబంధించిన వీడియోపై రోజా స్పందించారు. జగన్ కు వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, కక్ష్య సాధించడంలో భాగామే ఈ కేసు పెట్టారంటూ ఆమె అన్నారు. జగన్ పై కేసు పెట్టడానికి ఒక ఫేక్ వీడియోను బయటకు వదిలారు. ఒక ఫేక్ వీడియోను వదిలి వైసీపీని భయపెట్టాలని చూస్తున్నారని ఆమె అన్నారు.
ఆరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు
తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ ఆరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు లోనైన ఆయన, ఈసారి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో నిర్ధారించింది. ఈ వ్యవహారంపై అధికారులు ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించట్లేదని సమాచారం. ఆయన నుంచి వచ్చే సమాచారంపై రాజకీయ పార్టీల నేతల ప్రమేయంపై స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో పథకాల పతనం.. హరీష్ రావు విమర్శలు
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా చేసిన వ్యాఖ్యలలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రజా ప్రయోజన పథకాలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్, గ్యాస్ బండకు రాయితీ బంద్, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బందయినట్టే అని హరీష్ పేర్కొన్నారు. ఆత్మశుద్ధిలేని యాచార మదియేల, భాండశుద్ధి లేని పాకమేల? అనే సామెతను కోట్ చేస్తూ కాంగ్రెస్ నైతికతను ప్రశ్నించారు.
పెళ్లైన తరువాత ప్రియుడితో 2000 ఫోన్ కాల్స్.. వెలుగులోకి కీలక విషయాలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసు మొదట కనిపించినంత సాధారణం కాకుండా, దాని వెనుక ఉన్న కథనం ఆవిష్కరించబడుతున్న కొద్దీ నోరెళ్లబెట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 ఏళ్ల తేజేశ్వర్‌కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి కేవలం ఐదు రోజులు ముందు ఐశ్వర్య అనూహ్యంగా అదృశ్యమైంది. ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందని అనుమానాలు తలెత్తాయి.
అయితే ఫిబ్రవరి 16న తిరిగి ఇంటికి వచ్చిన ఐశ్వర్య, తేజేశ్వర్‌ను ఫోన్‌లో నమ్మించి, ప్రేమగా ప్రవర్తిస్తూ, కుటుంబ సమస్యల వల్లే వెళ్లానని పేర్కొంది. తేజేశ్వర్ మళ్లీ నమ్మి, మే 18న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన వెంటనే, ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా తన ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుతుండడంతో మనస్పర్థలు మొదలయ్యాయి. అదే సమయంలో తేజేశ్వర్ ఆకస్మికంగా జూన్ 17న కనిపించకుండా పోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అతడి కుటుంబ సభ్యులు అనంతరం గద్వాలలో మృతదేహంగా గుర్తించారు.
జూన్ 26న అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..!
కూటమి ప్రభుత్వం నేపథ్యంలో జూన్ 26న అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. చిరకాల వాంఛగా ఉన్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తాజాగా ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈనెల 26న అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారని అయన తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. 127 సంవత్సరాల రాజమండ్రి హ్యావ్ లాక్ వంతెన పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. 97 కోట్ల 44 లక్షల రూపాయల అంచనాలతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు సిద్ధం కానున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ ఏడాది ఏపీలో టూరిజం అభివృద్ధి 375 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయించుకున్నామన్నారు. ఇకపోతే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం నగరం, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త రానున్నాయి. రాష్ట్రాన్ని మరింత పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.