జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం
పారిస్ డైమండ్ లీగ్ 2025 పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. జూన్ 20న (శుక్రవారం) పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో నీరజ్ తన సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ను ఓడించాడు. గత రెండు టోర్నమెంట్లలో నీరజ్ వెబర్ చేతిలో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఆ రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకున్నాడు. పారిస్ డైమండ్ లీగ్‌లో, నీరజ్ చోప్రా తన మొదటి ప్రయత్నంలోనే 88.16 మీటర్లు విసిరాడు. దీంతో అగ్రస్థానంలో నిలిచి చివరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత నీరజ్ రెండవ ప్రయత్నంలో 85.10 మీటర్ల దూరం అధిగమించాడు. నీరజ్ మూడవ, నాల్గవ, ఐదవ ప్రయత్నాలు ఫౌల్‌లుగా మారాయి. ఆరవ ప్రయత్నంలో, అతను 82.89 మీటర్లు విసిరాడు.
సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభం.. గిరిజన విద్యార్థులు రికార్డ్ సృష్టించారు
విశాఖ నగరం ఈ ఉదయం అద్భుత దృశ్యానికి వేదికైంది. అర్బన్ సముద్రతీరాన ఆర్కే బీచ్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ యోగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన యోగాసనాల ప్రదర్శన 45 నిమిషాలపాటు సాగనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతోపాటు స్థానికులు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. భారతీయ మాతృకలపై ఆధారపడిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందన్నారు. దేశంలోనే 12 లక్షల ప్రాంతాల్లో యోగ ఆసనాలు నిర్వహించబడుతున్నాయని ఆయన తెలిపారు.
యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోడీ
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా విశాఖలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరయ్యారు. ఆర్కేబీచ్ నుంచి భీమిలి వరకు కంపార్ట్‌మెంట్స్ ఏర్పాటు చేశారు. యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను ప్రపంచ వ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోడీ అని తెలిపారు. మోడీ సంకల్ప సాధకుడు.. యోగా భారతీయులకు దక్కిన గౌరవమని అన్నారు. యోగాకు 175 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి మోడీ అని కొనియాడారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి.. యోగాపై ఇకో సిస్టంని డెవలప్ చేస్తున్నాం
విశాఖపట్నం సాక్షిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సముద్రతీరాన లక్షలాది మంది ప్రజలు చేరి యోగాసనాలు చేస్తూ ఈ వేడుకను ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు. 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, యోగా గ్లోబలైజ్ కావడం సామాన్యమైన విషయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని, అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదే అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
ఇట్స్ అఫీషియల్.. వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. కృష్ణం రాజ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. మొదటి నుండి పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 24, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ అధికారికంగా ఈ అప్డేట్ ప్రకటించడంతో, పవన్ ఫ్యాన్స్‌లో దిల్ కుష్ అవుతున్నారు.
పద్మావతి ఎక్స్ ప్రెస్ లో చోరి.. 40 గ్రాముల బంగారం అపహరణ
పద్మావతి ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ చోటుచేసుకుంది. రైళ్లో ప్రయాణిస్తున్న దొంగలు రెచ్చిపోయారు. మూడు బోగీల్లో చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు మహిళల నుంచి 40 గ్రాముల బంగారం ఆపహరించారు. బంగారం అపహరణకు గురవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. కావలి – శ్రీ వెంకటేశ్వర పాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో ప్రయాణం చేస్తూనే చోరికి పాల్పడి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు పోలీసులు తెలిపారు.
సైబర్ నేరగాళ్ల వలలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.. రూ. 1.04 కోట్లు స్వాహా
సైబర్ నేరగాళ్లు అమాయకులనే కాదు ఉద్యోగులను, విద్యావంతులను కూడా బురిడికొట్టిస్తున్నారు. తాజాగా అనంతపురంలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్ల వలకి చిక్కాడు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. సీఐడీ అధికారి అంటూ బెదిరించి రూ. 1.04 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఓబులదేవ నగర్ కి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి మహిళలను వేదిస్తున్నావని, మనీలాండరింగ్ కి పాల్పడ్డావని సైబర్ నేరగాడు కాల్ చేశాడు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. కేసు నుంచి తప్పించడానికి కొంత డబ్బులు ఇస్తే వదిలేస్తామని సైబర్ నేరగాళ్లు చెప్పారు. సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి ఈ నెల 16,17,18 తేదీల్లో సైబర్ నెరగాడు చెప్పిన అకౌంట్ కి రూ. 1.04 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశాడు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. అనంతరం ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అనంతపురం టూ టౌన్ పోలీసులకి పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో, సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదులో, రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించారని పేర్కొన్నారు. అరెస్టు అనంతరం కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనపై IPC సెక్షన్లు 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఆయనను ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే ప్రక్రియ చేపట్టిన పోలీసులు, తరువాత జైలుకు తరలించనున్నారు. అయితే, వైద్య పరీక్షలకు ముందుగా BRS లీగల్ టీమ్ రాక కోసం వేచి చూడాలని, తమ అభ్యర్థనను పోలీసులకు తెలిపారు కౌశిక్ రెడ్డి.
మళ్లీ ఫాంలోకి వచ్చిన దేవి శ్రీ.. ‘కుబేరా’ తో హ్యాట్రిక్ కొట్టాడుగా
తెలుగు సినీ పరిశ్రమకు.. విశిష్టమైన సంగీతం అందించిన సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ పేరు ముందు వరుసలో ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో, ఆయన సంగీతం ఎన్నో సినిమాలకు ప్రాణం పోసింది. అయితే, ఇటీవల కొన్ని సంవత్సరాలుగా దేవి శ్రీ కి వరుసగా సరైన హిట్‌లు లేవు. పుష్ప: ది రైజ్ మినహా, ఆయనకు భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టులు తక్కువే. వాల్తేరు వీరయ్య వంటి ఆల్బమ్‌లు మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, అవి DSP స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదు. కానీ ఇప్పుడు దేవి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.. ‘పుష్ప 2: ది రూల్’, ‘థాండెల్’, ‘కుబేరా’ వంటి వరుస భారీ చిత్రాలతో, DSP మళ్లీ తన పంజా చూపిస్తున్నారు. ఈ మూడు సినిమాలతో ఆయన మ్యూజికల్ హ్యాట్రిక్‌ను పూర్తి చేశారని చెప్పవచ్చు. పుష్ప 2 పాటలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా, ఈ సౌండ్‌ట్రాక్ సినిమాపై హైప్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ‘థాండెల్’ పాటలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. తాజాగా విడుదలైన కుబేరా చిత్రం కూడా మంచి టాక్ తో పాటు, దేవీ శ్రీ సంగీతం ఎంతో బలాన్నిచ్చింది. పాటలు తక్కువగా ఉన్నా.. సినిమా మూడ్‌ను మలచడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇకపై ఆయన నుంచి మరిన్ని అద్భుతమైన ఆల్బమ్‌ల కోసం ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
‘ట్రంప్ నిజంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు’.. ట్రంప్‌ను నామినేట్ చేసిన పాకిస్తాన్
ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో యుద్ధాలను ఆపడంలో తాను ముఖ్యమైన పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇంతలో, పాకిస్తాన్ ప్రభుత్వం 2026 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును అధికారికంగా ప్రతిపాదించింది. 2025లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాత్మక దౌత్య జోక్యం, మధ్యవర్తిత్వం కారణంగా ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంతో కాల్పుల విరమణ తీసుకురావడంలో ట్రంప్ జోక్యాన్ని పాకిస్తాన్ ప్రశంసించింది. ట్రంప్ ప్రయత్నాల కారణంగా కాల్పుల విరమణ సాధ్యమైందని, పెద్ద యుద్ధ ముప్పును నివారించగలిగామని ఆ ప్రకటన పేర్కొంది. దీనివల్ల రెండు అణ్వాయుధ శక్తుల మధ్య యుద్ధం జరిగే అవకాశం తప్పిందని పేర్కొంది. ఈ అవార్డుకు ఆయన నిజంగా అర్హుడని తెలిపింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిస్పందనగా ఇస్లామాబాద్ ఆపరేషన్ బన్యన్ ఉన్ మార్సూస్ ను ప్రారంభించిందని పాకిస్తాన్ తెలిపింది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను వేగంగా పెంచింది. కానీ ట్రంప్ జోక్యం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడింది. ఈ జోక్యం ట్రంప్ శాంతి స్థాపకుడిగా పాత్రకు రుజువు. చర్చల ద్వారా ఈ వివాదాన్ని ముగించాలనే ఆయన నిబద్ధతకు కూడా ఇది రుజువు.