హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొందరు వ్యక్తులు చెప్పులు విసిరేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కొందరు అధికార పార్టీ నాయకులు ఆయనపై చెప్పులు విసిరేయత్నం చేయగా అక్కడే వున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.