టెన్షన్ పుట్టిస్తున్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ కౌంటింగ్
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ కౌంటింగ్ అనుక్షణం టెన్షన్ పుట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఉంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1654 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 41 మంది అభ్యర్ధుల ఎలిమినేషన్ పూర్తయింది. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కి పోలైన ఓట్లు 96,842 కాగా టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి పోలైన ఓట్లు 95,188గా వున్నాయి. తుది దశకు చేరింది పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ కౌంటింగ్. నరాలు తెగే టెన్షన్ మధ్య రెండు పార్టీలు నేతలు వున్నారు. బీజేపీ, పిడిఎఫ్ లకు పాలైన రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారనున్నాయి. వైసీపీ, టిడిపి గెలుపోటములను నిర్దేశించనున్నాయి ఆ ఇద్దరి అభ్యర్థుల ఓట్లు. దీంతో ఏం జరుగుతుందోనని పోలీసులు పూర్తి భద్రతా ఏర్పా్ట్లు చేశారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీ విప్ జారీ
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే స్థానిక సంస్థలు, టీచర్లు, గ్రాడ్యుయేట్ల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై విప్ జారీ చేయాలని భావిస్తోంది టీడీపీ. ఈ నెల 23వ తేదీ జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది. 23 మంది పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది టీడీపీ. టీడీపీ ఎమ్మెల్యే విప్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీచేశారు. విప్ ను ఆయా ఎమ్మెల్యేలకు స్పీడ్ పోస్టులో పంపించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా అందజేసింది టీడీపీ. 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాల్సిందిగా ఆదేశించింది. ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా టీడీపీ కూడా తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. సంఖ్యాబలం లేకున్నా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టడం ఆసక్తిగా మారింది. వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు తమకు ఓటేస్తారనే నమ్మకంతోనే అనురాధను రంగంలోకి టీడీపీ దించినట్టు తెలుస్తోంది.
సరిగా నిద్రపోవడం లేదా? అయితే ఈ రిస్క్ తప్పదు
మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో విశ్రాంతి, మంచి నిద్ర అంతే అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలని అందరూ అంటుంటారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు కూడా ఎనిమిది గంటలు నిద్రపోవాలని అంటున్నాయి. కానీ ఎన్ని గంటలు నిద్రపోవాలనే విషయం అంతా తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి రోగాలెలా వస్తాయో చూస్తే.. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా మనం ఎనిమిది గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెబుతుంటారు. ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి అంత మంచివి కావు. అయితే ఎక్కువ నిద్ర అనేది ఈరోజుల్లో సాధ్యం కావడం లేదు. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలి. చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలి.. టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు.మన జీవనశైలి, పరుగుల ప్రపంచంలో పని ఒత్తిడి కారణంగా చాలామంది నిద్రకు దూరమవుతున్నారు.
చరణ్ హైదరాబాద్ లో అడుగుపెడితే అర్థరాత్రి ర్యాలీలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలిచిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంటే రామ్ చరణ్ మాత్రం ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశాడు. ఇండియా టుడే నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్న చరణ్, అక్కడి నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ కి చేరుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ కి మెగా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ‘జై చరణ్’, ‘జై ఆర్‌ఆర్‌ఆర్’ నినాదాలు, క్రాకర్ ల చప్పుల్లతో బేగంపేట విమానాశ్రయ ప్రాంగణం మారుమోగింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య రామ్ చరణ్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఎయిర్పోర్ట్ నుంచి చరణ్ ఇంటి వరకూ అభిమానులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జస్ట్ మిస్ లేదంటే సొరచేపకు బ్రేక్ ఫాస్టే
భూమి మీద ఇంకా నూకలు ఉండి ఉంటాయి.. కొద్ది క్షణాలు ముందుగా నీటిలోకి దూకితే సొరచేపకు ఆహారం అయ్యేది. స్కూబా డైవింగ్ చేద్ధాం అనుకున్న యువతి, సముద్రంలోకి దూకేందుకు సిద్ధం అవుతున్న సమయంలో సొరచేప నోరు తెరుచుని రెడీగా ఉంది. అయితే ఇది గుర్తించిన మహిళ చివరి క్షణంలో నీటిలోకి దూకకుండా, పడవలోనే ఉండిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. స్కూబా సూట్ తో సిద్ధమైన యువతి, సముద్రం నీటిలో దూకేందుకు పొజీషన్ తీసుకుంది. అయితే చివరి క్షణంలో నీటిలో ఏదో ఉన్నట్లు గుర్తించి, నీటిలో దూకకుండా మళ్లీ పడవపైకి ఎక్కుతుండటం వీడియో చూడవచ్చు. క్షణాల వ్యవధిలో షార్క్ నోరు తెరుచుకుని నీటి నుంచి పైకి రావడం ఇందులో కనిపిస్తోంది. కేవలం కొన్ని మీటర్ల దూరంలో మృత్యువును దగ్గరగా చూడటం సదరు మహిళ వంతైంది. ఒళ్లుగగుర్పాటుకు గురి చేసిన ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ల మంది చూశారు. ఇటీవల కాలంలో సొరచేపల దాడుల వల్ల పలువురు మరణించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో షార్క్ ఎటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఘటనలో మాత్రం మహిళకు ఇంకా అదృష్టం ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ రెడీ అంటూ ఓ నెటిజన్ల కామెంట్ చేయగా.. సొరచేప కిస్ ఇచ్చేందుకు ప్రయత్నించిందంటూ మరోకరు కామెంట్ చేశారు.
కో స్టార్ ని బ్లాక్.. అన్ బ్లాక్ చేసిన అల్లు అర్జున్
హీరోయిన్ భానుశ్రీ మెహ్రా గుర్తుందా!? గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘వరుడు’ సినిమాలో హీరోయిన్! ఆ సినిమా తర్వాత అమ్మడికి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఆ చిత్ర దర్శకనిర్మాతలు ఓ స్ట్రేటజీ ప్రకారం మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని హైడ్ చేశారు. సినిమా విడుదలైన తర్వాత భానుశ్రీ మెహ్రా ఐడెంటిటీని రివీల్ చేశారు. కానీ సినిమా అప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో భానుశ్రీ మెహ్రాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా… హైదరాబాద్ లో కొన్ని పెళ్ళిళ్ళలకు హాజరై నవ వధూవరులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. కానీ ఆ పబ్లిసిటీ కూడా మూవీ కలెక్షన్స్ ను పెంచలేకపోయింది. ఇదిలా ఉంటే… ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో భానుశ్రీ మెహ్రా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని లో-బడ్జెట్ మూవీస్ తో కాలం గడిపేస్తోంది. అయితే… అల్లు అర్జున్ ‘వరుడు’లో నటించినా తనకు ఆ తర్వాత పెద్దంతగా అవకాశాలు రాలేదని, అయినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూనే ఉన్నానంటూ భానుశ్రీ మెహ్రా ఈ రోజు ట్వీట్ చేసింది.
దమ్కీ ఈవెంట్ లో ఎన్టీఆర్ కి షాకిచ్చిన ఫ్యాన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు ఎన్టీఆర్. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ నందమూరి, విశ్వక్ సేన్ మ్యూచువల్ ఫాన్స్ తో నిండిపోయింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ని చూడడానికి నందమూరి ఫాన్స్ శిల్పకళా వేదికకి వచ్చారు. ఆ ఆడిటోరియం ఇప్పటివరకూ చూడని క్రౌడ్ ని, చెయ్యని సెలబ్రేషన్స్ ని చూపించిన ఎన్టీఆర్ ఫాన్స్, ‘జై ఎన్టీఆర్’ నినాదాలతో శిల్పకళా వేదికని దద్దరిల్లేలా చేశారు. దాస్ కా ధమ్కీ సినిమా హిట్ అవ్వాలి అని చెప్పిన ఎన్టీఆర్, ఇంత అభిమానం చూపిస్తున్న అభిమానులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అని చెప్పాడు.
ఎగిరే బైక్స్ వచ్చేస్తున్నాయ్… ఎగరడానికి రెడీనా?
గాల్లో విమాన ప్రయాణాలు నేడు సాధారణమయ్యాయి. ఈ మధ్యే ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తున్నాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా త్వరలోనే అందుబాటులోకి గాల్లో ఎగిరే బైకులు రానున్నాయి. ఎగిరే బైక్ భవిష్యత్తులో ఎలా ఉంటుందోనని కొన్నేళ్లుగా ప్రజలు ఊహించుకుంటూనే ఉన్నారు. అదే సమయంలో, చాలా మంది దాని గురించి కలలు కూడా కంటున్నారు. ఇప్పటికే కొంతమంది తమ కారును బైక్‌లా నిర్మించారు. ఇలాంటి వీడియోలు రోజురోజుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఎగిరే బైక్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. జపనీస్ స్టార్టప్ AERWINS XTURISMO పేరుతో ఫ్లయింగ్ బైక్‌ను రూపొందించింది. ఇది గాలిలో ఎగరగలిగే హోవర్‌బైక్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్‌గా దీన్ని పేర్కొంటున్నారు. హోవర్‌బైక్ ప్రస్తుతం జపాన్‌లో అమ్మకానికి ఉంది. AERWINS CEO ఈ బైక్‌ను యునైటెడ్ స్టేట్స్‌లో విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. XTURISMO వీడియో సోషల్ మీడియాలో తుఫానులా వ్యాపిస్తోంది. వైరల్ వీడియోలో, ఆ బైక్‌పై ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అవతలివాడు దూరం నుంచి ఇదంతా చూస్తున్నాడు. బైక్ నడపడానికి కూర్చున్న వ్యక్తి. ఆ బటన్‌ను నొక్కిన కొన్ని సెకన్లలో, బైక్ గాలిలో ఎగురుతుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @entrepreneursquote షేర్ చేశారు. నిజానికి ఈ వీడియో @xturismo_official ద్వారా అప్‌లోడ్ చేయబడింది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. దాంతో పాటు బైకు గురించి పలు ప్రశ్నలు కూడా అడుగుతున్నారు.