నేటినుంచి పాఠశాల పిల్లలకు రాగిజావ పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం చేరనుంది. రేపటి నుండి బడి పిల్లలకు ఉదయం పూట రాగి జావ అందించనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా రేపటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఏటా రూ. 86 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. ఆర్థికఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోలని విద్యార్థినీ, విద్యార్ధులకు ఈ పథకం ద్వారా పోషకాహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.రేపు క్యాంప్ కార్యాలయం నుండి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 44392 పాఠశాలల్లోని 37.63లక్షల మంది పిల్లలకు వారంలో మూడు రోజుల పాటు రాగి జావ పంపిణీ చేస్తారు. రాగి జావ ద్వారా రక్తహీనత, పోషకాల లోపాలను నివారించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
కానిస్టేబుల్ సాహసం..నదిలోకి దూకిన యువతిని కాపాడి హీరో అయ్యాడు
పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణే కాదు, పౌరులు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకుంటుంటారు. విజయవాడలో ఒక కానిస్టేబుల్ చేసిన సాహసం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈమధ్యకాలంలో చిన్న చిన్న కారణాలతో యువతీ, యవకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటోంది. ఆత్మహత్యయత్నంకు యత్నించిన యువతిని రక్షించిన కానిస్టేబుల్ ను అభినందించారు డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి..ఈనెల 17న యానం గోదావరి ఎదురులంక బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యయత్నం చేసింది యువతి.యువతి నదిలోకి దూకేసింది. అయితే, అటుగా వెళ్తున్న ఎఆర్ కానిస్టేబుల్ అంగాని వీరబాబు గమనించి వెంటనే రంగంలోకి దూకాడు. వెంటనే గోదావరిలోకి దూకి సదరు యువతిని రక్షించి తల్లితండ్రులకు అప్పగించారు ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబు. కానిస్టేబుల్ ధైర్య,సాహాసాన్ని ప్రసంసిస్తూ ఈరోజు డిజిపి కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబుకు నగదు బహుమతి అందజేశారు డీజీపీ. ప్రధానమంత్రి జీవన్ రక్షా పతకానికి వీరబాబు పేరు సిఫార్సు చేయాలంటూ సంబంధిత అధికారులకు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఆ యువతిని ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ కి ప్రశంసలు లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
తక్కువ ధరకే ఇండియాకు చమురు సరఫరా.. రష్యా కీలక నిర్ణయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి చమురు దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో ఐదు రెట్లు పెరిగి 41.56 బిలియన్ డాలర్లకు ( రూ. 3.40లక్షల కోట్లు ) చేరినట్లు వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మన దేశ చమురు దిగుమత్తుల్లో రష్యా 18వ స్థానంలో ఉంది. ఆ ఏడాది 9.86 బిలియన్ డాలర్ల చమురు దిగుమతులు నమోదయ్యాయి. ఇప్పుడు చమురు దిగుమత్తుల్లో నాలుగో పెద్ద దేశంగా రష్యా నిలిచింది. జనవరిలో భారతదేశ చమురు దిగుమత్తుల్లో 28శాతం రష్యా నుంచే పని చేస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ చమురు దిగుమతుల్లో ఒక శాతం వాటానే కలిగిన రష్యా.. 2023 జనవరిలో 1.27 మిలియన్ బ్యారెళ్లతో ( రోజువారీ ) 28 శాతం వాటాను సొంతం చేసుకుంది. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు తగ్గించుకున్నాయి. దీంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే రష్యా భారత్ కు చమురు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో రష్యా నుంచి భారతదేశం పెద్ద ఎత్తున చమురు దిగుమతికి మొగ్గు చూపిస్తుంది.
సర్కారీ స్కూళ్ళలో ఇక నైట్ వాచ్ మెన్ల నియామకం
నాడు నేడు ద్వారా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైట్ వాచ్ మెన్ల నియామకానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5388 నాడు-నేడు స్కూళ్లకు నైట్ వాచ్ మెన్లను నియమించేలా ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు పేరెంట్స్ కమిటీకి అధికారాలు దఖలుపరుస్తూ జీవో జారీ అయింది. ఈ వాచ్ మెన్లకు ఎంత జీతం ఇవ్వాలనేది కూడా జీవోలో పేర్కొన్నారు. నెలకు రూ. 6 వేల మేర నైట్ వాచ్ మెన్లకు గౌరవ భృతి ఇవ్వాలని జీవోలో పేర్కొంది ఏపీ సర్కార్.టాయిలెట్ మెయిన్ టెనెన్స్ ఫండ్ నుంచి నైట్ వాచ్ మెన్లకు గౌరవ భృతి ఇవ్వాలని జీవోలో వివరించింది. నైట్ వాచ్ మెన్లను నియమించే ప్రక్రియలో స్కూళ్లల్లో పని చేసే ఆయాల భర్తలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డుల్లో అందుబాటులో ఉన్న ఎక్స్ మిలటరీ మెన్లకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలని జీవోలో వెల్లడించింది. నైట్ వాచ్ మెన్ల నియామకంతో సర్కారీ స్కూళ్ళ భద్రతకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా. స్కూళ్ళకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ జరుగుతుందని అంటున్నారు.
హ్యాపీయెస్ట్ దేశం ఫిన్లాండ్ ..ఆరోసారి ఘనత
ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమౌన దేశంగా వరుసగా ఆరోసారి ఈ ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత సంతోషంగా ఉండే దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. వాస్తవానికి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ ప్రచురిస్తుంది. దీనిని 150కి పైగా దేశాలలో ప్రజల నుంచి వచ్చిన ప్రపంచ సర్వే ఆధారంగా రూపొందిస్తుంది. మార్చ్ 20 ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఐక్య రాజ్యసమితి వార్షిక హ్యాపీనెస్ సూచీ ప్రకారం.. డెన్మార్క్ అత్యంత సంతోషకరమైన దేశంగా రెండో స్థానంలో ఉండగా.. ఐస్ లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇక వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ నివేదికలో నేపాల్, చైనా, శ్రీలంకల కంటే దిగువున ఉంది. భారత్ 126వ స్థానంలో ఉంది. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా హ్యాపీనెస్ నివేదికలో వాటి ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. రష్యా 72వ స్థానంలో ఉండగా.. ఉక్రెయిన్ 92వ స్థానంలో ఉంది. కాగా, ఒక దేశ హ్యాపీనెస్ ని దాని తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి తదితరాల ఆధారంగా కొలిచి హ్యాపీనెస్ సూచీలో స్థానం కల్పిస్తారు. అయితే అనుహ్యాంగా 2021లో ఇతరుల పట్ల దయ చూపడం, ముఖ్యంగా అపరిచితులకు సహాయం చేయడం వంటివి పెరిగాయి. ఇది 2022లో మరింత ఎక్కువగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ పేర్కొంది.
మహిళా ఉద్యోగులకు జగన్ కానుక.. చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే ఛాన్స్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా ఉద్యోగులకు మరో అవకాశం కల్పించారు. మహిళా ఉద్యోగులు సర్వీసు కాలంలో ఎప్పుడైనా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎం వి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్సీలు టి కల్పలత, ఎం వి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను… పిల్లలు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే వాడుకోవాలన్న నిబంధనను తొలగించాలని సీఎంకు విన్నవించారు ఎమ్మెల్సీలు. దీనిపై సీఎం స్పందించారు. ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నిబంధనను మార్పు చేస్తూ… సర్వీసు కాలంలో ఎప్పుడైనా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను మహిళా ఉద్యోగులు వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. పిల్లల సంరక్షణకు అవకాశం ఉంటుందని మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్‌ను మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలకు పెంచాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఉగాది పచ్చడి తయారుచేసే విధానం ఏంటంటే..
తెలుగు వారి ఉగాది అంటే తెలుగు సంవత్సరాది తొలిరోజు అని అర్థం. పశ్చాత్య దేశాల్లో జనవరి 1 కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఉగాదిని వేడుకల్లా నిర్వహించుకుంటారు. ఉగాది రోజు ఇష్టదైవాన్ని పూజించుకుని ప్రసాదంగా ఉగాది పచ్చడిని తింటారు. ఉగాది పచ్చడి తయారీ కాలన్ని బట్టి మారుతూ ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తయారుచేస్తారు. ఉగాది పచ్చడిలో ఆరురుచులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే..ఉగాదికి ఖచ్చితంగా తయారుచేయాల్సిన ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. అవే.. తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదు. తీపికి బెల్లాన్ని, కారానికి పచ్చిమిర్చిని, మరికొంతమంది కారం వాడుకుంటారు, పులుపుకి చింతపండు లేదా నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు, ఉప్పు, వగరుకి మామిడి కాయని, చేదు వేపుపువ్వుని వాడడం వస్తున్న ఆనవాయితీ.. మన జీవితంలోని కష్టసుఖాలకు, జరగబోయే మంచి చెడులను ఈ రుచులు సూచిస్తాయని అంటారు. ఇక ఉగాది పచ్చడి తిన్నప్పుడు తీపి తగిలితే ఆ ఏడాదంతా సాఫీగా.. ఆనందంగా సాగుతుందని భావిస్తారు ప్రజలు. అలాగే చేదు తగిలితే కష్టాలు తప్పవని, పులుపు కష్టం సుఖం కలిసే వస్తాయని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడి తయారీ పూర్వాకాలం నుంచి వస్తున్న పద్దతి ఇది.
రేవంత్ హాత్ సే హాత్ జోడో యాత్రకు ఐదు రోజుల బ్రేక్
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఉగాది పండుగ, ఇతరత్రా కారణాలతో ఈనెల 25 వరకు రేవంత్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ వేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 24, 25 తేదీల్లో మరో సారి నిరుద్యోగ నిరాహార దీక్ష చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేయాలని కాంగ్రెస్ నిర్ణయం చేసింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయ పోరాటం, ప్రజా పోరాటం కాంగ్రెస్ పార్టీ మరింత ఉదృతం చేయనుంది. అనంతరం 26 న జుక్కల్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తారని పార్టీవర్గాలు వెల్లడించాయి. నిన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర నసుల్లాబాదు నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాదయాత్ర విజయవంతంగా సాగింది. కాగా.. నిన్న రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన సిట్ అధికారులు ఇంటి గోడకు నోటీసులు అతికించి వెళ్లారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు విచారణ రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక సిట్ నోటీసులు తనకు మాత్రమే కాదు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు.
గ్రాండ్ విక్టరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఫైనల్ బెర్త్ ఖరారు..?
సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్ ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. పూజ వస్త్రకర్(19 బంతుల్లో 23, 3ఫోర్లు, ఒక సిక్స్ ), హర్మన్ ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23, 3 ఫోర్లు ), ఇసీవాంగ్ (24 బంతుల్లో 23, ఒక సిక్స్ ), అమన్ జ్యోత్ కౌర్ ( 16 బంతుల్లో 19, 2 ఫోర్లు ) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెస్ ( 2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి విజయం సాధించింది. షఫాలీ వర్మ ( 15 బంతుల్లో 33, 6 ఫోర్లు, ఒక సిక్స్ ) ఔట్ కాగా.. మెగ్ లానింగ్ ( 22 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, ఒక సిక్స్ ), అలైస్ క్యా్ప్నీ ( 17 బంతుల్లో 38 నాటౌట్, 1 ఫోర్, 5 సిక్స్ లు ) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు.