ఈడీకి కవిత లేఖ..నా గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నారు
ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈవిషయాన్ని ఆమె మీడియాకు తన ఫోన్లును సైతం చూపించారు. ఒక మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అంటూ ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని, కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా అని లేఖలో ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును, మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొ్న్నారు. అయితే దీనిపై ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర ఎలా స్పందించనున్నారు. కవిత రాసిన లేఖపై ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు వాయిదా
ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఒక రోజు వాయిదా పడిన రాజ్యసభ, లోక్ సభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే మరోసారి గౌతమ్ అదానీ- హిడెన్ బర్గ్ వ్యవహారంపై జేపీసీ ( జాయింట్ పార్లమెంటరీ కమిటీ ) విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. స్పీకర్ ఓంబిర్లా లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. గత వారం లండన్ లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మరోసారి లోక్ సభ సమావేశాలను వాయిదా పడ్డాయి. అదానీ-హిడెన్ బర్గ్ వ్యవహారంలో జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభ స్పీకర్ నేటి సమావేశాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ 2023 మొదటి భాగం మాదిరిగానే సెకండ్ హాప్ లో కూడా అంతరాయాలతో ముందుకుసాగుతుంది. నిన్న కూడా అధికార-విపక్షాల మధ్య తీవ్ర నిరసనలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ఇవాళ్టీ సమావేశాల్లోనూ తమ డిమాండ్లను కొనసాగిస్తూ, ప్రతిపక్ష నాయకులు అదానీ వ్యవహారంపై వి వాంట్ జేపీసీ అంటూ నినాదాలు చేశారు. వెంటనే దీనిపై విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజ్యసభలో అదానీ-హిడెన్ బర్డ్ సమస్యపై చర్చను రాజ్యసభ ఛైర్మన్ తిరస్కరించారు. అంతకుముందు, పార్లమెంట్ లోని మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలతో ఆయన సమావేశం అయ్యారు సభాలో తమ గొంతుకలను వినిపించేందుకు వ్యూహాలు రూపొందించారు.
అవినీతిలో నోబెల్., నటనలో ఆస్కార్ చంద్రబాబుకే
టీడీపీ నేతలు, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కుంభకోణాల్లో చంద్రబాబు ఎంత సిద్ధహస్తుడో చెప్పడానికి”నారా స్కిల్ స్కామ్” ఉదాహరణ…..ఈ స్కామ్ లో ఇప్పటికే కీలక నిందితులను ED విచారిస్తోంది….అరెస్ట్ అవ్వకుండా మిగిలింది చంద్రబాబు., ఆయన కొడుకే. సీమెన్స్ తో ట్రై పార్టీ ఒప్పందం….,గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంతా బూటకం. ఈ స్కామ్ వెనుక పుత్రరత్నం ప్రమేయం ఉంది. తండ్రి కొడుకులు పంది కొక్కుల్లా ప్రజాధనం తినేశారు. ఈ విషయం సీమెన్స్ నిర్ధారించింది.. ఏలేరు స్కామ్., స్టాంప్ పేపర్ల కుంభకోణం.,హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు చంద్రబాబు హయం అంతా అవినీతి మయం అన్నారు మంత్రి అమర్నాథ్. అవినీతిలో నోబెల్., యాక్టింగ్ లో ఆస్కార్ చంద్రబాబుకు ఇవ్వాలనేది నా ఆకాంక్ష….ఫోరెన్సిక్ ఆడిట్, షాడో ఫైల్స్ ద్వారా స్కిల్ డవలప్ మెంట్ కోసులో పూర్తి ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయి.. స్కిల్ స్కామ్ మరో యూరో లాటరీ లాంటి స్కీమ్…..రాజధానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమికి సంబంధం లేదు. పులివెందులలో లోకేష్ పోటీ చెయ్య గలుగుతాడా…..?3శాతం ఓటర్లు కలిగిన ఒక సెక్షన్ ఓటర్ల ప్రభావం పెద్దగా ఉండదు. పట్టభధ్రుల్లో అసంతృప్తికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాం అన్నారు. లోపం ఎక్కడ ఉందో పసిగట్టి మార్పులు చేసుకుంటాం అన్నారు మంత్రి అమర్నాథ్. ఇండియాకు.,కెన్యాకు మ్యాచ్ జరిగితే అప్పుడప్పుడు కెన్యా గెలుస్తుంది. అంత మాత్రాన కెన్యా బలమైందని చెప్పలేము. గెలుపు ముఖం చూడనందునే టీడీపీ సంబరాలు చేసుకుంటోందని విమర్శించారు.
సీఎం జగన్ పై యనమల తీవ్ర విమర్శలు
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీలో శాసనమండలిలో విపక్షనేత యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలేస్తాడని నేరగాళ్లే అనడం విడ్డూరం.దొంగే.. ‘‘దొంగ దొంగ’’ అన్నట్లుగా ఉంది జగన్ నైజం. రాష్ట్రంలో అసలు నేరగాడెవడు..? 13 ఛార్జిషీట్లున్న వ్యక్తి నేరగాడా, ఏ ఛార్జిషీట్ లేనోడు నేరగాడా..? రూ 43 వేల కోట్లు దోచేశాడని సిబీఐ చెప్పినోడు నేరగాడా, ఏ మరకా అంటని 14ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నేరగాడా..?వ్యవస్థలను నిర్మించినోడు నేరగాడా, ధ్వంసం చేసినోడు నేరగాడా..?ఉపాధి కల్పించినోడు నేరగాడా, ఉపాధి పోగొట్టినోడు నేరగాడా…? అందుక్కాదా మీకు దేవుడన్ని మొట్టికాయలేసింది.16నెలలు 16 మొట్టి కాయలు పడిందెవరికి..?నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో తెలుగుదేశం ఎందరినో ఎదుర్కొంది.ఇందిరాగాంధీలాంటి ఉక్కు మనిషినే ఎదుర్కొంది.. ఆమె ముందు జగనెంత, ఓ పిపీలకం కాదా..?ఏపిలో జగన్ ఒంటరి ఎందుకయ్యారు..? ఇన్ని కేసులు, ఎన్నో నేరాలు – ఘోరాలున్నాయి కాబట్టే జగనుకు అందరూ దూరం.రాకాసి బల్లి, రాబందు వంటి అంతరిస్తున్న జాతుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకడు అని తీవ్రంగా విమర్శించారు యనమల రామకృష్ణుడు.
వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకతతో టీడీపీ గెలిచింది
అసెంబ్లీలో జరిగిన ఘటన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం సంయమనం పాటించాలి..జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి..స్పీకర్ ను ప్రశ్నిస్తే మార్షల్స్ ద్వారా నియంత్రించాలి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవటం ఏంటి..టీడీపీ ఎమ్మెల్యే స్వామిపై జరిగిన దాడి అప్రజాస్వామికం..విజయవాడలో ధర్నా చౌక్ కు పోయే దారులు మొత్తం మూసివేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని రోడ్లపైనే అరెస్టులు చేశారు..సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలనే అమలు చేయాలని అంగన్వాడీలు నిరసనలు చేస్తున్నారు..ఇక్కడ అమలు జరుగుతుంది ప్రభుత్వ రాజ్యాంగమా.. పోలీసుల రాజ్యాంగమా..ప్రజలు సమస్యలపై వీధుల లోకి వచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేస్తే అడ్డుకోవటం సరికాదు..బడ్జెట్ సమావేశాలు కనీసం 21 రోజులు నిర్వహించాలి.. కానీ తూతూ మంత్రంగా మమ అనిపిస్తున్నారు..ఉగాది పండుగకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అన్నారు.. ఇప్పుడా పరిస్థితి లేదు..ప్రాజెక్టులు పూర్తి చేయటంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..అసెంబ్లీలో సీఎం జగన్ ఎంత సేపు కూర్చున్నారో కానీ విశాఖ సమిట్ లో మాత్రం నాలుగు గంటలు కూర్చున్నారు..నాలుగు గంటలు సీఎం జగన్ అధానీ భార్యతో ఏం చర్చలు జరిపారో చెప్పాలి.. అదానీ వల్ల దేశ ప్రతిష్ట మంటగలిసింది..విశాఖ ఉక్కు కోసం సీఎం జగన్ ఢిల్లీకి డెలిగేట్స్ ను తీసుకువెళతారు ని ప్రకటించారే కానీ పట్టించుకోలేదు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బరిలో ఉండటం వల్లే పీడీఎఫ్ అభ్యర్ధులు ఓడారు..ప్రైవేట్ స్కూళ్ళలో అర్హత లేని వాళ్ళకు ఓటు హక్కు కల్పించటం వల్లే వైసీపీ అభ్యర్ధులు గెలిచారు..వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత రావటం వల్లే గ్రాడ్యుయేట్స్ ఓడారు..అన్నీ రంగాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైందన్నారు శ్రీనివాసరావు.
ఈ సినిమా దెబ్బకి కర్ణాటకలో ‘దసరా’కి కొత్త కష్టాలు తప్పవా?
KGF, కాంతార లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ ఫిల్మ్స్ భారి బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడమే కాదు ప్రజెంట్ చెయ్యడానికి కూడా ముందుకొస్తున్నారు. ఈ బడా బ్యానర్ ప్రెజెంట్ చేస్తున్న మూవీ ఫస్ట్ మూవీ ‘గురుదేవ్ హొయసాల’. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ జనరేషన్ లో చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ విలన్ టర్న్డ్ హీరో ‘డాలి ధనంజయ’ నటిస్తున్న 25వ సినిమాగా తెరకెక్కిన ‘హొయసాల’ సినిమాని విజయ్ డైరెక్ట్ చేశాడు. పవర్ యాక్షన్ కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో మేకర్స్, ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ‘గురుదేవ్ హొయసాల’ పాత్రలో గ్రే షెడ్ ఉన్న పోలిస్ పాత్రలో ధనంజయ ఇంటెన్స్ గా కనిపించాడు. కథని రివీల్ చెయ్యకుండా కేవలం క్యారెక్టర్ ఇంట్రో మాత్రమే చూపిస్తూ, యాక్షన్ ఎపిసోడ్స్ ని చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. టీజర్ కి ఇచ్చినట్లే అజ్నీష్ లోక్నాథ్ మరోసారి ట్రైలర్ కి కూడా సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.
గ్రాండ్ విక్టరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఫైనల్ బెర్త్ ఖరారు..?
సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్ ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. పూజ వస్త్రకర్(19 బంతుల్లో 23, 3ఫోర్లు, ఒక సిక్స్ ), హర్మన్ ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23, 3 ఫోర్లు ), ఇసీవాంగ్ (24 బంతుల్లో 23, ఒక సిక్స్ ), అమన్ జ్యోత్ కౌర్ ( 16 బంతుల్లో 19, 2 ఫోర్లు ) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెస్ ( 2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి విజయం సాధించింది. షఫాలీ వర్మ ( 15 బంతుల్లో 33, 6 ఫోర్లు, ఒక సిక్స్ ) ఔట్ కాగా.. మెగ్ లానింగ్ ( 22 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, ఒక సిక్స్ ), అలైస్ క్యా్ప్నీ ( 17 బంతుల్లో 38 నాటౌట్, 1 ఫోర్, 5 సిక్స్ లు ) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు.
మార్కెట్‌లోకి కొత్త యాంకర్. ఈమెనెప్పుడైనా చూశారా?
ప్రపంచ మీడియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ.. ఎవరూ.. చూడని ఒక కొత్త యాంకర్ తాజాగా తెర మీదికొచ్చారు. ఆమె పేరు.. చాట్‌జీపీటీ. అదేంటి?.. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌బాట్ కదా అనుకుంటున్నారా?. అది నిజమే. ఆ కృత్రిమ మేధతో రూపొందించిన పరికరమే ఇప్పుడు యాంకర్‌గా సరికొత్త అవతారమెత్తింది. అంతర్జాతీయ ప్రముఖులిద్దరిని అలవోకగా ఇంటర్వ్యూ చేసేసింది. అందులో ఒకరు.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కాగా ఇంకొకరు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్. ఈ ఇద్దరిని చాట్‌జీపీటీ.. ఆసక్తికరమైన.. కాస్త కష్టమైన ప్రశ్నలే అడిగింది. వాటికి.. వాళ్లు కూడా.. అంతే ఆకట్టుకునేలా సమాధానాలు చెప్పారు. ఈ విషయాన్ని బిల్‌గేట్స్.. లింక్డిన్ ద్వారా వెల్లడించారు.గ్లోబల్ ఎకానమీ పైన, జాబ్ మార్కెట్ మీద టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బిల్‌గేట్స్ బదులిస్తూ.. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో నిపుణుల కొరతను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తీరుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. యవ్వనంలోకి వెళ్లగలిగితే మీ కెరీర్ కోసం మీకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చుకుంటారన్న ప్రశ్నకు బిల్‌గేట్స్ సరదాగా జవాబిచ్చారు.