రాహుల్ గాంధీ ఇంటికెళ్ళిన పోలీసులు.. ఎందుకంటే?
మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ వ్యాఖ్యలపై ఆయన నుంచి వివరాలు కోరుతున్నారు పోలీసులు. ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీస్ టీం తుగ్లక్ లేన్ లో ఉన్న రాహుల్ ఇంటికి వెళ్లింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న క్రమంలో కాశ్మీర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో మహిళలపై లైంగికదాడుల అంశాన్ని ప్రస్తావించారు. యాత్రలో భాగంగా తనను కొంతమంది మహిళలు కలిశారని, ఇప్పటికీ తాము లైంగికదాడులు ఎదుర్కొంటామని చెప్పారని అన్నారు. అయితే ఆ బాధితులెవరో తమకు చెప్పాలని కావాల్సిన భద్రత ఇస్తామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
అన్నదాతకు అండగా నిలవండి.. కేసీఆర్ కు రేవంత్ లేఖ
రాష్ట్రంలో అకాల వర్షంతో రైతాంగం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజయీయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నదాతకు అపార నష్టం వాటిల్లిన తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి వరద పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టమాట, మిర్చి, మొక్క జొన్న, పొద్దుతిరుగుడు, శనగా, కూరగాయలు, మామిడి, తదితర పంటలకు తీవ్ర నష్టం సంభవించిందన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంపై రేవంత్ రెడ్డి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సాగు ఖర్చులు పెరిగాయని ప్రభుత్వం నుంచి ఎటువంటి చేయుత లేని పరిస్థితుల్లో ఆకాల వర్షం సృష్టించిన బీభత్సం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రైతుల పరిస్థితి మారిందన్నారు.
గెలవలేమని చెప్పి.. రూ 50 కోట్లు ఖర్చుచేశారు
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. ఎన్నికల్లో అనూహ్య పరిణామాల మధ్య విజయం సాధించిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలవలేమని చెప్పి .. 50కోట్లు ఖర్చు పెట్టారు. వైసీపీ నుంచి డబ్బు తీసుకుని ఓటర్లు మాకు తీర్పు ఇచ్చారు. ధర్మం వైపు నిలబడిన ఓటర్లు సరైన తీర్పు ఇచ్చారు. వైసీపీ వారు 2లక్షలు రూపాయలు ఓటర్లకు ఇస్తే.. ఆ డబ్బు నాకు ఇచ్చారు. కౌంటింగ్ సమయంలో కలెక్టర్ కు పై నుంచి ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా ప్రజా తీర్పును అపహాస్యం చేశారు. ప్రజా తీర్పును తారు మారు చేయాలనుకున్నారు. రాత్రి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు. చివరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో దిగి వచ్చారు. నా గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రామగోపాల్ రెడ్డి. ఇటు అనంతపురం నుంచి పులివెందులకు బయలుదేరారు నూతన పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ చేయాలన్న యోచనలో టిడిపి శ్రేణులు వున్నాయి. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణ ల నేపథ్యంలో ర్యాలీకి అనుమతించలేదు పోలీసులు. పులివెందులకు వచ్చే మార్గంలో, పట్టణంలో పలుచోట్ల భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటుచేశారు. పులివెందులకు రానీయకుండా రాంగోపాల్ రెడ్డి స్వగ్రామం కాంబల్లెకు తరలించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘర్షణలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు.
ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయి
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల వైసిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీరుపై మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ నిష్పక్షపాతంగా జరగలేదు.. చాలా అక్రమాలు జరిగాయి. మేము రీపోలింగ్ రీకౌంటింగ్ అడగడం లేదు. కేవలం బండిల్స్ వెరిఫికేషన్ చేయాలని కోరుతున్నాం. టిడిపి నాయకులకు ధైర్యం ఉంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. మమ్మల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకోమని సంకేతం ఇచ్చారు. టిడిపి మాజీ ప్రజా ప్రతినిధులు ఏజెంట్లుగా వచ్చారు. వారు అధికారులను ప్రభావితం చేశారన్నారు. మాకు వచ్చిన ఓట్లను టిడిపి బండిల్స్ లో కలిపారు. సాక్ష్యాలతో సహా చూపించి రీ వెరిఫికేషన్ చేయాలని కోరాము. కానీ జిల్లా ఆర్వో , జిల్లా ఎస్పీలు ఏకపక్షంగా వ్యవహరించారు. టిడిపి ఏజెంట్లు ఇండిపెండెంట్ ల పాసులు అడ్డం పెట్టుకొని పదుల సంఖ్యలో వచ్చారు. కనీసం పోలీసులు వారిని చెక్ చేయలేదు. మేము ఒక ఏజెంట్ ని కావాలని అడిగితే అనుమతి ఇవ్వలేదు. కచ్చితంగా అన్ని అంశాలను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాం. ఆర్ఓ, జిల్లా ఎస్పీలు దీనికి బాధ్యత వహించాలి. నాకు మొదటి ప్రాధాన్యతలోనే 98 వేల ఓట్లు వచ్చాయి. టిడిపికి బిజెపి పిడిఎఫ్ అభ్యర్థుల ఓట్లు కలిశాయి. అయినప్పటికీ వారి మెజారిటీ కేవలం 7000 మాత్రమే. నైతికంగా ఇది నా విజయం..నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అన్నారు వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి.
చిన్నారి భవ్యకు జగన్ భరోసా.. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
తన సాయం కోరి వచ్చేవారికి సీఎం జగన్ భరోసా ఇస్తుంటారు. వైద్యం కోసం వచ్చేవారికి తనవంతూ సాయం అందిస్తూ ఆపద్బాంధవుడిలా మారుతుంటారు. ఎప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్ళినా తనను కలిసేందుకు వచ్చేవారికి సమయం కేటాయిస్తూ ఉంటారు. దివ్యాంగులకు, అంతుచిక్కని వ్యాధులతో బాధపడే పిల్లలకు అపారమయిన సాయం చేస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన మానవత్వం చాటుకున్నారు. సిఎం పాల్గొన్నే సభ ప్రాంగణం వద్ద చిన్నారికి వైద్య చికిత్స అందించాలంటూ తల్లితండ్రుల ఫ్లెక్సీలతో అభ్యర్థించారు. కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన ఆరేళ్ల భవ్య మెదడవాపు వ్యాధితో గత కొంతకాలంగా చికిత్స పొందుతుంది. ఆమె చికిత్సకు భారీగా ఖర్చవుతోంది. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రిలో 20 లక్షలు ఖర్చు చేశామంటున్నారు తల్లిదండ్రులు. ఇంకా వైద్యానికి స్థోమత లేకపోవడంతో సిఎం జగన్ మోహన్ రెడ్డిని అభ్యర్దించడానికి వచ్చామంటున్నారు భవ్య తల్లితండ్రులు. తమ బాధను సీఎంకి తెలియచేయాలని వారు ప్రయత్నించారు. అనంతరం వారు సిఎం ను కలిసి చిన్నారి భవ్య ఆరోగ్యపరిస్థితిని వివరించారు తల్లిదండ్రులు. తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందించాలని సిఎంకు వినతి పత్రం అందించారు. పదినిముషాల పాటు చిన్నారి తల్లితండ్రులతో మాట్లాడి భవ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సిఎం జగన్. ఇప్పటికే 20 లక్షలు ఖర్చు పెట్టాం.. ఇక తమకు ఆర్దిక పరిస్దితి లేదంటూ సిఎం కు తెలిపారు చిన్నారి తల్లి,తండ్రులు. చిన్నారి భవ్యను మీరే ఆదుకోవాలని వారు అభ్యర్థించారు. తక్షణమే చిన్నారి భవ్యకు మెరుగైన వైద్య సేవలందించాలంటూ అధికారులకు సిఎం ఆదేశాలు జారీచేశారు. దీంతో భవ్య తల్లిదండ్రులు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియచేశారు.
వైద్యం కోసం అల్లాడుతున్న చిన్నారులకు జగన్ సాయం
పరిపాలనలో ఎంత బిజీగా ఉన్నా సాయం అందించే విషయంలో మాత్రం జగన్ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. తిరువూరు పర్యటనలో జగన్ చిన్నారుల వైద్యానికి సాయం అందించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పిల్లల వైద్య సహాయం కల నెరవేరింది. ఎలాగైనా సీఎంని కలవాలని భావించిన చిన్నారుల తల్లిదండ్రుల ఆశ నెరవేరింది. భరోసా ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్ పేట గ్రామంలో నివాసం ఉంటూ రంగులపని చేసే గాదే సురేష్ – గాయత్రి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో ఇద్దరు వేదశ్రీ దుర్గ (12) లాస్య ప్రియ(8) పుట్టుకతోనే అంతు పట్టని వ్యాధితో (కంజెనిటికల్ మైస్తేనియా సిండ్రోమ్) బాధపడుతున్నారు. అయితే వైద్యం కోసం ఖమ్మం విజయవాడలో ఎన్నో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ లో తిరిగిన సరైన వైద్యం దొరకట్లేదు. వేలకు వేలు ఖర్చుపెట్టడం ఆ దంపతులకు భారంగా మారింది. తరువాత రెయిన్ బో హాస్పటల్లో చూపిస్తే.. వెయ్యి మందిలో ఒకరికి ఇలాంటి వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి నిర్మూలన లేదు కానీ మెడిసిన్ ద్వారా వారిని కంట్రోల్ చేయవచ్చు అని వైద్యులు తెలపగా ఆ వైద్యానికి మందులు పౌడర్ ఇంజక్షన్ వంటి వాటికి నెలకి ఇద్దరు మీద 30 నుంచి 40 వేలు అవుతున్నాయి ఈ ఆర్థిక భారం పెరగటం వల్ల శ్రీ సామినేని ఉదయభాను గారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్ళారు. తమ పిల్లల్ని ఆదుకోవాలని వారు సీఎంని కోరారు. తక్షణం స్పందించి వైద్య సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. సీఎం స్పందనకు ధన్యవాదాలు తెలిపారు ఆ తల్లిదండ్రులు.
మరోసారి ప్రేమలో పడ్డ అఖిల్.. ఎవరితోనంటే?
అక్కినేని నట వారసుడుగా అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. మొదటి సినిమా నుంచి నాలుగు సినిమా వరకు మనోడు ఆశించిన ఫలితాన్ని మాత్రం అనుకోలేకపోయాడు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అఖిల్.. ఏజెంట్ గా వస్తున్నాడు.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అఖిల్ సినిమాల విషయం పక్కన పెడితే.. అయ్యగారు ప్రస్తుతం సింగిల్ గా ఉన్నాడు. గతంలో అఖిల్ కు శ్రీయాభూపాల్ కు నిశ్చితార్థం జరిగి.. పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయిన విషయం తెల్సిందే. ఈ జంట ప్రేమించుకొని ఇరు కుటుంబాల అంగీకారంతోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి ఉంది అనగా తాము వీడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటినునుంచి అఖిల్ సింగిల్ గానే ఉంటున్నాడు.
చిరంజీవితో గొడవలు… మోహన్ బాబు ఏమన్నారంటే?
కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నేడు తన 71 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం మోహన్ బాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. వ్యక్తిగత విషయాలతో పాటు చిరంజీవితో ఆయనకున్న గొడవల గురించి కూడా నోరు విప్పారు. ” నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా, విలన్ గా, హీరోగా, నటుడిగా, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఎదిగాను. దానికి కారణం నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులు. నేను పడిన కష్టాలు పగవాడు కూడా పడకూడదని కోరుకుంటాను. నేను సంపాదించినవన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లు, స్థలాలు అన్ని అమ్మేశాను. వాటిని తిరిగి సాధిస్తాను అనుకున్నాను.. అలాగే సాధించాను. ఇల్లే కాదు ఒక యూనివర్సిటీనే స్థాపించాను.
పేకమేడల్లా కూలిన భారత్.. 117 పరుగులకే ఆలౌట్
విశాఖపట్నంలోని డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ పేకమేడల్లా కుప్పకూలింది. అత్యంత చెత్త బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 31 పరుగులతో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితో పాటు అక్షర్ పటేల్ (29 నాటౌట్) పర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లందరూ ఘోరంగా నిరాశపరిచారు. గత వన్డే మ్యాచ్‌లో ఒంటరి పోరాటంతో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్ సైతం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వగా.. అందులో నలుగురు డకౌట్ అయ్యారు. గత మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిన సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్‌లోనూ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్య్లూగా ఔటయ్యాడు.