టీడీపీ సభ్యుల తీరు గర్హనీయంగా ఉంది
అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలపై మంత్రులు మండిపడ్డారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని, కులాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని, ఒకరి భుజం మీద తుపాకీ పెట్టి మరొకరిని కాల్చడం చంద్రబాబు నైజమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాజ్యాంగ మీద ప్రమాణం చేసి మరీ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి ఏడ్చి వెళ్లిపోయి.. బయట ఉండి అమాయకుడైన టీడీపీ దళిత శాసనసభ్యుడిని అడ్డంపెట్టి స్పీకర్‌పైనే దాడికి పురిగొల్పాడని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, వైయస్‌ఆర్ సీపీ దళిత శాసనసభ్యుడు సుధాకర్‌బాబుపై శాసనసభలో టీడీపీ సభ్యులు చేసిన దాడిని మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. మరోవైపు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ సభ్యుల తీరు ఉంది. స్పీకర్ ఛైర్ ను గౌరవించాల్సిన బాధ్యత అందరి పై ఉంది. డోలా వీరాంజనేయ స్వామి గడిచిన వారం రోజులుగా సభాపతి కుర్చీని నెట్టడం, ప్లకార్డులు పెట్టడం చేస్తూనే ఉన్నారు. దళిత సభ్యులు, ఉప ముఖ్యమంత్రి పై దాడి చేయటం, దుర్భాషలాడటం చేస్తూనే ఉన్నారు. కాగితాలు చింపి సభాపతి పై వేయటం టీడీపీ ఎమ్మెల్యేలకు అలవాటుగా మారింది. వాళ్ళే దాడి చేస్తారు…వాళ్ళే భోరున ఏడుస్తారు. బీసీలంటే చంద్రబాబుకు చిన్న చూపు ఉందన్నారు వేణుగోపాల్. బీసీ నాయకుడు తమ్మినేని స్పీకర్ గా ఎన్నిక అయినప్పుడు కూడా కుర్చీ వరకు తీసుకుని వెళ్ళటానికి చంద్రబాబు రాలేదు. స్పీకర్ పట్ల గౌరవాన్ని చూపించటానికి చంద్రబాబుకు మనసు రాలేదు. దెబ్బతిన్నది మా సభ్యుడు సుధాకర్ బాబు అన్నారు మంత్రి వేణుగోపాల్.
క్విడ్ ప్రోకో… షెల్ కంపెనీలకు పర్యాయపదం వైసీపీ
ఏపీలో జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఏ స్కామ్ లేని సీమెన్స్ ఒప్పందంలో ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది.సీమెన్స్ సంస్థ, ప్రేమ్ చంద్రా రెడ్డి, సెంట్రల్ టూల్ డిజైన్స్ సంస్థ తప్పు చేయకుండా చంద్రబాబే తప్పు చేశారా..?ఈడీ ఎంక్వైరీ చేస్తుండగా.. సీఐడీ ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు.ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది కాబట్టి.. తప్పేననే రీతిలో సీఎం కామెంట్లు చేశారు.అరెస్ట్ చేస్తేనే తప్పు చేసినట్టు అయితే.. ఈ రూల్ సీఎం జగనుకూ వర్తిస్తుంది.అరెస్ట్ అయినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు అనే వాదనే సీఎం జగన్ విషయంలో వైసీపీ చేస్తోంది కదా..?మూడేళ్ల క్రితం సీఐడీ విచారణలో ఏం తేల్చారు..?కేవలం ఓటమి భారం నుంచి తప్పించుకోవడానికే స్కిల్ డెవలప్మెంట్ పై సభలో చర్చించారు.దేశానికి క్విడ్ ప్రొ కో.. షెల్ కంపెనీలు అనే పదాలను పరిచయం చేసింది జగనే.క్విడ్ ప్రో కో.. షెల్ కంపెనీలు అనే పదాలను సీఎం జగన్ మాట్లాడితే ఎలా..?సీఎం జగన్ అనుకున్న విధంగా ఈడీ విచారణలో తేలుతుందనే అనుమానం వైసీపీ ప్రభుత్వానికి వచ్చి ఉంటుంది.అందుకే సమాంతరంగా సీఐడీ విచారణ చేపడుతోంది.రెండు రోజుల పాటు సీమెన్స్ ఒప్పందంలో ఏదో జరిగిపోయిందని సభ సమయాన్ని దుర్వినియోగం చేసింది.ఎక్కడో జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి జరుగుతోన్న విచారణకు ఏపీకి.. చంద్రబాబుకు సీఎం జగన్ లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ ఇచ్చిన నివేదిక బయట పెట్టండి.ఏ అకౌంట్లకు డబ్బులు వెళ్లాయి.. ఏ పెద్దల ఖాతాలకు వెళ్లాయోననే వివరాలు విడుదల చేయండి.గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలేవీ తప్పు పట్టడం లేదు.
జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం
జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం చేరనుంది… రేపటి నుండి బడి పిల్లలకు ఉదయం పూట రాగి జావ.. వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమం.. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పథకం అమలు.. 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి.. పథకం కోసం ఏటా రూ. 86 కోట్ల వ్యయం.. రేపు క్యాంప్ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
వీడియో ఫుటేజ్ విడుదల చేయాలి
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు. అసెంబ్లీ హైసెక్యూర్టీ జోన్ అయినా.. ప్రతిపక్షానికి ప్రతికూలమైన జోన్.మా సభ్యుల ప్రాణాలకు అపాయం కలిగించే రీతిలో దాడి జరిగింది కాబట్టే.. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాం.సభలో భౌతిక దాడులు జరిగితే పోలీస్ విచారణ జరపొచ్చనే రూలింగ్.. నిబంధనలు ఉన్నాయి.పవిత్రమైన అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజా, వెలంపల్లి, కార్మూరి టీడీపీ సభ్యులపై దాడి చేశారు.ఇలాంటి సంఘటనను ఇప్పటి వరకు చూడలేదు.అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ఎమ్మెల్యేలపై దాడులు జరిగాయి.జీవో నెెంబర్-1 రద్దు చేయాలని కోరితే దాడులు చేస్తారా..?కుట్రపూరితంగానే టీడీపీ సభ్యుడు స్వామి, అశోక్, బుచ్చయ్యల మీద దాడి చేశారు.జగన్ డైరెక్షనులోనే స్వామి తదితర ఎమ్మెల్యేలపై భౌతిక దాడి జరిగింది.ఇవాళ దాడి చేసిన వాళ్లు.. ప్రాణాలు తీస్తారనే అనుమానం ఉంది.మేం తుళ్లూరు పీఎస్సులో ఫిర్యాదు చేశాం.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.సుధాకర్ బాబు మళ్లీ కోడి కత్తి తరహా డ్రామా ఆడుతున్నారు.. అందుకే కట్టు కట్టుకున్నారు.ఉదయం సంఘటన జరిగితే ఇప్పటి వరకు వీడియో ఫుటేజ్ ఎందుకు విడుదల చేయలేదు..?ఎడిటింగ్ చేయకుండా వీడియో ఫుటేజ్ విడుదల చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు రామానాయుడు.
వాడు మనిషి కాదు మృగం.. గుండెను కోసి వండుకుని తినేశాడు
ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ లేదు. అసలు మనుషులను ఎందుకు చంపుతున్నారో కూడా తెలియడం లేదు. ఇంకొంతమంది చేసే హత్యల గురించి వింటే అసలు వీళ్లు మనుషులా.. మృగాలా..? అన్న అనుమానం కూడా రాకమానదు. సాధారణంగా మనుషులను పీక్కుతినే వారిని అఘోరాలు అంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకొనే వ్యక్తి వారికి మించిన మృగం అని చెప్పొచ్చు. అమ్మాయిలను అతి కిరాతకంగా చంపి.. వారి గుండెను వేరుచేసి దాన్ని వండుకొని తింటున్నాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో వారం క్రితం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమెరికాలోని ఓక్లహోమా అనే పట్టణంలో లారెన్స్ పాల్ ఆండర్సన్ అనే 42 ఏళ్ళ వ్యక్తి నివసిస్తున్నాడు. మొదటి నుంచి అతను డ్రగ్స్ కు అడిక్ట్ అవ్వడమే కాకుండా డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు కూడా పట్టుబడ్డాడు. ఇక్కడితో ఆగకుండా హత్యలకు కూడా పాల్పడ్డాడు. కొన్నిరోజుల క్రితం లారెన్స్ తన పక్కింట్లో ఉన్న యువతిని తన ఇంటికి పిలిచి హత్య చేశాడు. అనంతరం.. ఆమె గుండెను కోసి, వండుకొని తిన్నాడు. ఇక యువతీ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు లారెన్స్ ఇంటికి వచ్చి చూసి షాక్ అయ్యారు.
ఇవి తింటే డెంటల్ డాక్టర్తో పనే లేదు
గుండె, చర్మం, రోగనిరోధక వ్యవస్థ, రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ముఖ్యమైనవి అని చాలా మంది నమ్ముతారు. కానీ నోటి సంరక్షణ నోటి ఆరోగ్యానికి పెద్దగా శ్రద్ధ చూపరు. నోటి శుభ్రతను పట్టించుకోకపోతే నోటి నుంచి దుర్వాసన, పంటి నొప్పి, చిగుళ్ల నుండి రక్తం ఇతర దంతాల సమస్యలు సంభవించవచ్చు. వరల్డ్ ఓరల్ హెల్త్ డేను ప్రతి సంవత్సరం మార్చి 20 న జరుపుకుంటారు. ప్రపంచ నోటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి కొన్ని సూచనలు పాటించాలి. నోటి పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. శుభ్రత మాత్రమే కాకుండా.. పోషకాహారం కూడా దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని ఏ ఆహారాలు మెరుగుపరుస్తాయో తెలుసుకుందాం. సరైన ఆహారం తీసుకోకపోతే చెడు బ్యాక్టీరియా చేరి నోటి సమస్యలు తలెత్తుతాయి. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ దంత సంరక్షణ చర్యలు పాటించాలి.
తీరనున్న ఎల్బీనగర్ వాసుల కష్టాలు
నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పలు పనులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ కుడివైపు మరో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్ ని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటి, పరిశ్రమలు శాఖామంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్లై ఓవర్ మార్చి చివరి నాటికి ప్రారంభం కానుంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా చొరవ చూపింది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులలో ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా వాటిలో ఎల్బీనగర్ ఆర్.హెచ్.ఎస్ ఫ్లై ఓవర్ 19గా అందుబాటులోకి రానున్నది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులు కాగా జిహెచ్ఎంసి నిధులతో చేపట్టిన పనులలో 32 పనులు పూర్తయ్యాయి. మిగతా శాఖలకు సంబంధించిన ఆరింటిలో మూడు పూర్తికాగా మరో మూడు ప్రగతి దశలో ఉన్నాయి. గోల్నాక నుండి అంబర్ పేట్ వరకు గల ఈ ఫ్లై ఓవర్ జాతీయ రహదారుల శాఖ ద్వారా… ఉప్పల్ జంక్షన్ నుండి సి.పి.ఆర్.ఐ (మేడిపల్లి) వరకు గల ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి శంషాబాద్ వరకు చేపట్టనున్న ఈ రెండు 6 లైన్ల ఫ్లైఓవర్లను రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టారు.
రంజాన్ వేళ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
రంజాన్ మాసం ఆరంభం కానుండడంతో రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. కుటుంబంతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం ఆరంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త ప్రకటించారు. ముస్లీం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, బోర్డులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా అందరూ ప్రార్థనలు చేసేందుకు కార్యాలయాలు, పాఠశాలల నుంచి గంట ముందుగా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు అమల్లో ఉంటాయి. టీఎస్-ఎంఎస్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పవిత్ర రంజాన్ నెలలో కొంత సమయం ముందుగా బయలుదేరడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఉద్యోగులకు గంటపాటు మినహాయింపు ఇచ్చారు.
తండ్రితో గొడవలు… బయటకు వెళ్ళిపోయిన హీరో సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్న వారిలో సూర్య కుటుంబం ఒకటి. తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీ కుటుంబాలతోనే సూర్య ఇప్పటివరకు జీవిస్తూ వస్తున్నాడు. ఇక పెద్ద కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన జ్యోతిక సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. మరిదిని, తోటికోడలిని సైతం సొంత బిడ్డలానే చూసుకుంటూ ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారు. అయితే గత కొన్నిరోజులుగా ఈ కుటుంబంలో కూడా విబేధాలు తలెత్తినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తండ్రి శివ కుమార్ కు సూర్యకు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆయన తండ్రి కుటుంబం నుంచి విడిపోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇకపోతే కుటుంబాన్ని వదిలి సూర్య తన భార్యాబిడ్డలతో ముంబైకు మకాం మార్చనున్నాడట. అయితే ఈ వార్త ఎప్పుడో వచ్చినా ఇందులో నిజం లేదని అనుకున్నారు అందరు.. కానీ, ముంబైలో సూర్య రూ. 70 కోట్లు పెట్టి ఒక లగ్జరీ హౌస్ ను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా కూడా చెప్పడంతో ఈ వార్తలో నిజం ఉందని తెలుస్తోంది. ప్రముఖులు నివసించే జూహూ ఏరియాలో ఈ ఇల్లు ఉందట.