గ్రాడ్యుయేట్ ఫలితాలతో టీడీపీ సంబరాలు
గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో విజయంపై టీడీపీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. స్వీట్లు తినిపించుకున్నారు టీడీపీ నేతలు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ప్రభావితం చేసేవి కావని సజ్జల ఎలా చెబుతారు..? సజ్జల మంగళవారం మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలే ఓట్లు వేశారు. వేరే ప్రాంతాల్లో ఉన్న అగ్రవర్ణాలే ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి.పల్లెల్లో ఉద్యోగాలు.. ఉపాధి లేని బడుగు, బలహీన వర్గాల నిరుద్యోగ యువతే ఈ ఎన్నికల్లో ఓట్లేశారు.మాల, మాదిగ పల్లెల్లోని యువకులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఓటింగులో పాల్గొన్నారు.పట్టభద్రులు, టీచర్ల ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ జరగడం చరిత్రలో ఎప్పుడూ లేవు.గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మూడు స్థానాలనూ టీడీపీ దక్కించుకోవడం చరిత్రాత్మకం.ఈ విజయం టీడీపీది కాదు.. ప్రజలది.ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఎన్నికలు జరిగాయి.108 నియోజకవర్గాల్లోని ప్రజలు ప్రభుత్వ తీరుపై తమ తీర్పు చెప్పారు.అన్ని వర్గాల ప్రజలు పోలింగులో పాల్గొన్నారు.జగన్ పని తీరుపై ఇంత కంటే పెద్ద సర్వే ఏం ఉంటుంది..?పులివెందుల్లోనే జగన్ పని అయిపోయింది.నరకాసుర వధ జరగబోతోందని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.జగన్ పులివెందుల నుంచి పిల్లిలా పారిపోతారు.ఈ ఎన్నికలు మార్పునకు సంకేతం.ఈసీపై మా ఫిర్యాదు చేయడానికి సజ్జలకు సిగ్గుండాలన్నారు.
శ్రీరామనవమి వేడుకలపై జార్ఖండ్ సర్కార్ ఆంక్షలు
శ్రీరామనవమిపై ఆంక్షలు విధించింది. హజారీబాగ్ లో ప్రతీ ఏటా రామనవమి వేడులకు అట్టహాసంగా జరుగుతాయి. అయితే రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఎలాంటి సంగీతాన్ని పెట్టకూడదని, కర్రలు, వెదురులతో సంప్రదాయ నృత్యాలు నిర్వహించకూడదని, ఆయుధాల విన్యాసాలు చేయకూడదని నగరంలో ఆంక్షలు విధించింది. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని హజారీబాగ్ లోని బాద్కాగావ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ అన్నారు. హిందూ పండగల పట్ల వ్యవస్థ సున్నితంగా ఉండాలని ఆమె అన్నారు. వారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలోని సామాజిక వ్యవస్థను చెడగొడుతోందని అన్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ మాట్లాడుతూ..హిందూ మతం, సంప్రదాయాలకు ముప్పుపొంచి ఉందని, ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి వైఖరి హిందూ సంప్రదాయాలను చంపేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.
ఈఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత చూపలేదు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని, పీడీఎఫ్, ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టిడిపి వైపు మళ్ళాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటినీ కలిపి చూడాలి. ఏం రకంగాను ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవు. టిడిపి సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదు. ఈ ఫలితాలను మేము హెచ్చరిక గా భావించడం లేదు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదన్నారు సజ్జల. ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు?మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్లలో లేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. మొన్ననే కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్మెంట్ కూడా చేశాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టిడిపి పోటీ చేసింది. తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టిడిపి చేయొచ్చు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
సోషల్ మీడియాలో ప్రచారం అబద్ధం
నాపై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయ్యిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ ఇస్తే తప్పులేదు… కానీ అందుకు భిన్నంగా లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. నా విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా నేను భావించడం లేదని, మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలన్నారు. రాజ్యాంగబద్దంగా స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై నాకు గౌరవం ఉందని, ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే మహిళా కమిషన్ పిలవగానే హాజరయ్యానన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చానని బండి సంజయ్ వెల్లడించారు. నా స్టేట్ మెంట్ ను మహిళా కమిషన్ రికార్డు చేసిందని ఆయన తెలిపారు. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సుహ్రుద్బావ వాతావరణంలో జవాబిచ్చానన్నారు.
రూం తీసుకుని కామ్ గా ఉందామనుకున్నారు.. కానీ
స్నేహితులుగా మొదలై ప్రేమలో పడి సహజీవనం చేసిన ఇద్దరు యువతుల కథ హత్యతో ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లారి అంజలి స్వస్థలం మంచిర్యాల జిల్లా మామిటికట్టు. నెన్నెల మండల పరిధిలోని మన్నెగూడలోని తన అమ్మమ్మ ఇంటికి వస్తూ ఉండేది. అక్కడికి వెళ్లగా ఆ గ్రామానికి చెందిన కుర్ద్ మహేశ్వరి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఒక దశలో వీరి స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం నుంచి మంచిర్యాలలో అద్దెకు గది తీసుకుని మహేశ్వరి, ఆమె చెల్లి పరమేశ్వరి, సోదరుడు విఘ్నేష్ తోపాటు అంజలి కలిసి ఉంటున్నారు. అంజలి కళ్లజోడు దుకాణంలో పనిచేస్తోంది. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న మహేశ్వరి ఇటీవల ఉద్యోగం మానేసింది. కాగా, గత పదేళ్లుగా మహేశ్వరి వస్త్రధారణ, ప్రవర్తన అబ్బాయిలా మారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మహేశ్వరి, అంజలి సహజీవనం చేస్తున్నారని స్థానికులు తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై వైసీపీ పోస్టు మార్టం
అధికార వైసీపీకి గ్రాడ్యుయేట్స్ షాక్ ఇచ్చారా? మూడు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ స్థానాల్లో మూడింటిలో అధికార వైసీపీ ఓటమి పాలయ్యింది. దీనితో ఓటమికి కారణాలను విశ్లేషించుకునే పనిలో పడింది వైసీపీ. మొదటి సారి టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల్లో బరిలో నిలబడిన అధికార వైసీపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉపాధ్యాయులు వైసీపీ పట్టం కట్టినా గ్రాడ్యుయేట్స్ మాత్రం షాక్ ఇచ్చారు. రెండు టీచర్, మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో రెండు టీచర్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బకాయిలు వంటి పలు కారణాలతో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వస్తున్నాయి. దీనితో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కసరత్తు చేసింది. ప్రభుత్వ టీచర్లను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూనే ప్రైవేటు టీచర్ల ఓట్లు కూడా తమ ఖాతాలో పడేటట్లు చేసుకుంది. ఈ కసరత్తును విజయవంతంగా పూర్తి చేయగలిగిన వైసీపీ …గ్రాడ్యుయేట్స్ విషయంలో మాత్రం చతికిల పడింది.
తీరం తాకనున్న ఎన్టీఆర్ 30 తుఫాన్
నందమూరి అభిమానుల్లో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న అప్డేట్ బయటకి వచ్చేసింది. ఎన్టీఆర్ 30 ముహూర్తం ఎప్పుడు? ఏ రోజు ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుంది అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తూ ‘తుఫాన్ హెచ్చరిక’ అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఒక ట్వీట్ బయటకి వచ్చింది. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఎన్టీఆర్ 30’ మూవీ లాంచ్ మార్చ్ 23న జరగబోతుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. నిజానికి ఈ ముహూర్త కార్యక్రమం గత నెలలోనే జరగాల్సి ఉండగా తారకరత్న మరణించడంతో ‘ఎన్టీఆర్ 30’ లాంచ్ వాయిదా పడింది. కొత్త డేట్ మార్చ్ 23ని లాక్ చేసి ఎన్టీఆర్ 30 సినిమా ముహూర్త కార్యక్రమాన్ని చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. ఈ ముహూర్త కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి వస్తాడు అనే రూమర్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.
టెంత్ స్టూడెంట్స్ కి అలర్ట్.. 24 నుంచి హాల్ టికెట్లు
పదవ తరగతి పరీక్షల పై మంత్రి సబితా రివ్యూ చేశారు. వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24వ తేదీ నుండి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు, పాఠశాలలకు కూడా పంపుతాం అన్నారు మంత్రి సబితా. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారని, ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.త్వరలో డిఈఓ లు,ఆయా జిల్లాల కలెక్టర్లు,ఎస్పి లు,ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, విద్యార్థులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
స్నేక్ క్యాచర్లను ఆటాడుకుంటున్న కింగ్ కోబ్రా
జనరల్ గా పాములు వర్షం పడిన వెంటనే పుట్టలోంచి బయటికి వస్తాయి. పుట్టలోకి వర్షపు నీరు చేరడం.. అందులో వేడిగా ఉన్న కారణంగా బయటికి వస్తాయి. వర్షం పడగానే చల్లదనానికి పాములు బయట సంచరిస్తుంటాయి. ఇలా బయటికి వచ్చిన పాములు మనిషి కంట పడితే.. కొందరు చంపేస్తారు.. మరి కొందరు మాత్రం స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తుంటారు. స్నేక్ క్యాచ్ లను పామును చాలా ఈజీగా పట్టేస్తుంటారు. కానీ తాజాగా ఓ స్నేక్ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ పాములను పట్టే స్నేక్ క్యాచర్ లకు ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు స్టిక్ సాయంతో పడితే.. మరికొందరు ఒట్టిచేతులతోనే పట్టేస్తారు.. థాయిలాండ్ కు చెందిన ఓ స్నేక్ క్యాచర్ భారీ కింగ్ కోబ్రాలను కూడా సునాయాసంగా పడుతాడు. కింగ్ కోబ్రాను మభ్యపెట్టి మరీ పట్టేశాడు. పాము ముందు ఒకరిని నిలబెట్టి దాని నజర్ మళ్లీస్తాడు. వెనకాల నుంచి నెమ్మదిగా వచ్చే అతడెు ఒక్కసారిగా పడగవిప్పిన పాము తలను పట్టేస్తాడు. ఆపై దాన్ని సంచిలో బందిస్తాడు.