సంక్షేమానికి కోత పెట్టారు. బడ్జెట్ లో కొత్తదనం ఎక్కడ?
ఆర్థికమంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ ప్రభుత్వం డీబీటీల విషయంలో చెప్పేదొకటి.. చేసేదొకటి.గతేడా డీబీటీ స్కీంల కోసం జరిపిన కేటాయింపుల కంటే రూ. 2 వేల కోట్ల మేర తక్కువగా ఖర్చు పెట్టారు.సంక్షేమ పథకాల్లో కోత విధించడం వల్లే కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు పెట్టారని అర్తమవుతోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో డీబీటీల నిమిత్తం రూ. 54 వేల కోట్లు కేటాయించారు.సంక్షేమానికి ఈ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే కేటాయిస్తోంది.రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులు 60 శాతం మేర ఉంటే అరకొర కేటాయింపులు ఏ మాత్రం సరిపోతుంది..?విద్య, వైద్యం వంటి రంగాలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదు.ఫీజు రీ-ఇంబర్సుమెంట్ లోపభూయిష్టంగా ఉండడంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి.. డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి.దీని వల్ల విద్య, వైద్య సేవలు అందక పేదలు ఇబ్బంది పడడుతున్నారు.వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో కొత్తదనం లేదు.ఇప్పటి వరకు వైసీపీ నాలుగు బడ్జెట్టులు ప్రవేశ పెట్టినా ఎలాంటి అభివృద్ధి చూపడం లేదు.
బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ.. మండిపడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు
‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తోందని, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, ప్రజాస్వామ్యం గురించి చర్చించే రాహుల్ గాంధీ వంటి వారు దేశవ్యతిరేకులా..? అని ప్రశ్నించారు. జేపీ నడ్డా చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు, రాహుల్ గాంధీ యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదిన మరోసారి స్పష్టం చేశారు ఖర్గే. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడిపోతుందని, అందుకే పార్లమెంట్ లో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. నిజానికి ప్రధాని నరేంద్ర మోదీనే చాలా సార్లు విదేశాల్లో దేశాన్ని అవమానించారని అన్నారు.
టీడీపీకి మాటర్ వీక్….పబ్లిసిటీ పీక్
ఒకవైపు ఏపీ బడ్జెట్ పై సమాధానం ఇస్తున్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్టకథలతో రక్తి కట్టించారు. టీడీపీ పై ఆర్థికమంత్రి బుగ్గన సెటైర్లు వేశారు. నేను ఇంకా భోజనం చేయలేదు. టీడీపీ వాళ్లు శుభ్రంగా భోంచేసి పడుకుని ఉంటారు. బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే ఎవరైనా అల్లరి చేసి వెళ్లిపోతారా?35 ఏళ్ళ వయస్సులో ఎవరైనా బయోగ్రఫీ రాసుకుంటారా…?మనసులో మాట అని చంద్రబాబు రాసుకున్నాడు.అప్పటి నుంచి అల్లాడి పోతున్నాడు. మనం పుస్తకం తీయటం చదవటం…ఆ పుస్తకంలో ఉచిత సేవల కాలం పోయింది…ఇప్పుడు ప్రజల నుంచి డబ్బు సేకరించాలి అని చంద్రబాబు పుస్తకంలో రాశాడు.రెండు రూపాయల బియ్యం ఇచ్చినా ఎన్టీఆర్ ఓడిపోయారు అని రాశాడు. ప్రాజెక్టులు కడితే లాభం లేదు అని చంద్రబాబు రాశాడు. 60 శాతం ఉద్యోగులు అవినీతి పరులే అన్నాడు. టీడీపీకి మాటర్ వీక్….పబ్లిసిటీ పీక్ అన్నారు. అసంతృప్తి వాదులకు అసెంబ్లీలో పిట్ట కథ చెప్నారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. పాలనలో కావల్సింది వేగం కాదు స్థిరత్వం అన్నారాయన. చర్చ అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.
కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కుప్పకూలిన ఘటనలో పెరిగిన మృతులు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం నాటికి ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 10కి చేరుకుంది. సంభాల్ జిల్లాలోని కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కూలింది. కోల్డ్ స్టోరేజీ కుప్పకూలిన ఘటనలో శిథిలాల నుంచి 21 మందిని బయటకు తీస్తే ఇందులో 10 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై యోగి ఆదిత్య నాథ్ దర్యాప్తు చేయడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, తీవ్రగాయాల పాలైనవారికి రూ. 50,000 పరిహారాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారిందరికి ఉచిత చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పైకప్పు కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరిపేందుకు మొరాదాబాద్‌లోని పోలీసు కమిషనర్, డీఐజీ నేతృత్వంలో విచారణ కమిటీని కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ తన నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరినట్లు అధికారులు తెలిపారు.
నడిచివెళ్లే భక్తులకు త్వరలో ఉచిత దర్శనం టికెట్లు
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో టీటీడీ ఇ.ఓ ధర్మారెడ్డి మాట్లాడారు. తిరుమల కొండ పైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో భక్తులకు నాలుగంచెల విధానంలో దర్శనం కల్పిస్తున్నాం అన్నారు. రోజూ వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం అన్నారు. రాష్టంలో ఆదరణ తగ్గిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నాం అన్నారు. టీటీడీ ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయి.. వాటి సరసన రాజాం ఆలయం చేరిందన్నారు.జి.ఎం.ఆర్ కోరిక మేరకు టీటీడీ పాలకమండలి ఆమోదంతో రాజాం బాలాజీ ఆలయం విలీనం చేసుకున్నాం అన్నారు. తిరుపతి లడ్డూలను త్వరలో రాజాం ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంచుతాం అన్నారు. మరోవైపు తిరుమల ఆలయానికి భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు.తిరుమలలో 21వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వుంటుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది సర్వదర్శనం. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసింది టిటిడి.
కన్నుకు, కిడ్నీకి సర్జరీ జరిగింది… నోరు విప్పిన హీరో రానా
సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న నటుల కుటుంబంలోని వారసులు చిన్నతనం నుంచి ఆ ఇండస్ట్రీని చూస్తూనే పెరుగుతారు. అందుకే వారికి అందులోనే ఉండాలన్న కోరిక ఉంటుంది. చిన్నతనం నుంచి తాతను, తండ్రిని, బాబాయ్ ను చూసి పెరిగిన రానాకు ముందు ఆ సినిమాను ఎలా నిర్మించాలో నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. హీరో కన్నా ముందే రానా విఎఫ్ఎక్స్ లో సిద్దహస్తుడని తెలిసిందే. ఆ తరువాత లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న రానా ఈ మధ్యనే తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే సిరీస్ లో నటించాడు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. దగ్గుబాటి నటవారసుడు గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నాడు. అది గొప్ప విజయం అనుకుంటే.. రానా తన అనారోగ్య సమస్యల నుంచి ఎంతో దైర్యంతో పోరాడి గెలిచాడు. అది అంతకుమించిన విజయమని చెప్పాలి.
స్వప్నలోక్ అగ్నిప్రమాదం దురదృష్టకరం
సికింద్రాబాదులోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరం. పాతికేళ్లు నిండకుండానే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఉద్యోగం కోసం పొట్ట చేత్తో పట్టుకొని రాజధానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించింది. కాల్ సెంటర్లో పనిచేస్తున్న వీరంతా దిగువ మధ్య తరగతి కుటుంబాల వారని తెలిసింది. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక పొగతో ఉక్కిరిబిక్కిరి అయి చివరకు ఆసుపత్రిలో వీరంతా ప్రాణాలు విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. అనేక కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు ఉన్న స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలి.ఎందుకంటే సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక కాంప్లెక్స్ లో ఇటీవలే ప్రమాదం జరిగి ముగ్గురు మరణించారు.ఇప్పుడు ఈ ప్రమాదం.. ఈ ఘటన మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా? భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమా అనేది తేలాల్సి ఉంది.కార్యాలయ సముదాయాలు, షాపింగ్ మాల్స్ ను తనిఖీ చేయడంతో పాటు అక్కడి విద్యుత్ లైన్ల నిర్వహణను పరిశీలించాలి.స్వప్న లోక్ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలి. అదే విధంగా కడుపు కోతకు గురైన కుటుంబాల వారికి తగినంత నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
టూర్ల పేరుతో ప్రజాధనాన్ని జగన్ వృథా చేస్తున్నారు
సీఎం జగన్ పై మండిపడ్డారు టీడీపీ నేతలు. వివేకా కేసులో సీబీఐ అరెస్ట్ నుంచి అవినాశ్ రెడ్డిని కాపాడటానికే హడావుడిగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. రాష్ట్రంలో ఒకపక్క బడ్జెట్ సమావేశాలు, మరోపక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాభవం. సీఎం ఇప్పుడు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమిటి..? తమ్ముడు అవినాశ్ ను రక్షించాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రత్యేక విమానాల్లో కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి జగన్ ఢిల్లీ వెళ్లింది నిజం కాదా..? తన అరెస్టును ఆపాలంటూ అవినాశ్ సీబీఐ కోర్టుని ఆశ్రయిస్తే, తీర్పు వెలువడక ముందే, అతన్ని ఢిల్లీ పిలిపించింది, రక్షించడానికే కదా..?బాబాయ్ హత్య కేసు విచారణ కీలక.దశలో ఉండగా, ప్రధాన ముద్దాయి మీతో కలవడం, మీఇంట్లో ఉండటం, అక్కడినుండి మీరు ప్రధాని ఇంటికి వెళ్లడం రాష్ట్ర ప్రయోజనాల కోసమంటే ఎవరు నమ్ముతారు..?గతంలో పరమేశ్వరరెడ్డి భార్య వివేకా హత్య ‘ఇంటి మనుషుల పనే’ అంటే మీరెవరూ ఎందుకు ఆమె మాటల్ని ఖండించలేదు?దేశమంతా ‘జస్టిస్ ఫర్ వివేకా’ అని నినదిస్తుంటే, మీరుమాత్రం ‘సేవ్ మై బ్రదర్’ అని ఢిల్లీకి ప్రయాణం కట్టడం ఎంతవరకు సబబు..?తెలంగాణ హైకోర్టు స్పష్టంగా సీబీఐ తదుపరి దర్యాప్తుకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇస్తే, మీ తమ్ముడి తరుపున మీరు ‘రెడ్ సిగ్నల్’ ఎందుకు వేస్తున్నారు..? అని విమర్శించారు వర్ల రామయ్య.
నమ్మినందుకు నట్టేట ముంచారు.. కస్టమ్స్ అధికారినని మోసం
బ్యాంక్ ఫ్రాడ్స్, సైబర్ ప్రాడ్స్ గురించి ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యాశకు పోయి డబ్బులను పోగొట్టుకుంటున్నారు. తాము కొనని లాటరీ టికెట్ కు లాటరీ ఎలా తగిలింది.? తమకు తెలియకుండా గిప్టులు ఎవరు పంపిస్తారు.? అని ప్రశ్నించుకుంటే ప్రజలు ఈ మోసాలకు గురికారని అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో ఇంత అవగాహన పెరుగుతున్నా మోసపోయే వారు ఇంకా ఉంటున్నారు. తాజాగా మహారాష్ట్ర థానే నగరానికి చెందిన 36 ఏళ్ల మహిళను సైబర్ మోసగాళ్లు మోసం చేశారు. ఏకంగా రూ. 12 లక్షలకు పైగా డబ్బును పోగొట్టుకుంది. ఇద్దరు నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారు. అయితే ఇందులో ఒకరు సదరు మహిళకు 2022 నుంచి సోషల్ మీడియాలో స్నేహం చేస్తున్నాడు. తాను మలేషియాకు చెందినవాడినని, యూకేలో పనిచేస్తున్నట్లు మహిళను నమ్మించాడు. నిందితుడు సదరు మహిళకు గిఫ్ట్ పంపిస్తున్నట్లు నమ్మించాడు. ఆ సమయంలోనే ఢిల్లీ కస్టమ్స్ అధికారిగా ఉన్న మహిళ నుంచి తనకు కాల్ వచ్చినట్లు మహిళ పేర్కొంది.