ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన రెండు పిటిషన్లలో ఉపశమనం లభించలేదు. సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర బెయిల్ కొనసాగించాలని.. వైద్య పరీక్షల కోసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేసుకున్నారు.
ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఉదయం పదిగంటలు దాటిన తర్వాత భానుడి భగభగలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు (సోమవారం) 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల…
సీఎం జగన్ ఈరోజు సాయంత్రం పులివెందుల వెళ్ళనున్నారు. దాదాపు రెండు నెలలపాటు ప్రచారంలో హోరెత్తించిన ముఖ్యమంత్రి.. నిన్న పిఠాపురంలో జరిగిన సభతో ప్రచారానికి తెర వేశారు. కాగా.. ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు సీఎం జగన్.. సాయంత్రం తన సతీమణి భారతితో కలిసి పులివెందులకు వెళ్తున్నారు. రేపు తాను పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలోని బాకరపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రేపు (గురువారం) కేంద్రమంత్రి అమిత్ షా రానున్నారు.
ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ మండిపడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత కమలం గూటికి చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాషాయ గూటికి చేరారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో చేరి నుదిటకు కుట్లు కూడా వేసుకున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.