ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఉదయం పదిగంటలు దాటిన తర్వాత భానుడి భగభగలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు (సోమవారం) 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎల్లుండి (మంగళవారం) 165 మండలాల్లో తీవ్రవడగాల్పులు,149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
NAMO : సర్వైవల్ కామెడీ మూవీగా వస్తున్న ‘నమో’.. రిలీజ్ ఎప్పుడంటే..?
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (72)
శ్రీకాకుళం 3, విజయనగరం17, పార్వతీపురంమన్యం 10, అల్లూరి 2, అనకాపల్లి 2, కాకినాడ 6, కోనసీమ 2, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 7, కృష్ణా 2, బాపట్ల కొల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (200)
శ్రీకాకుళం 12, విజయనగరం 7, పార్వతీపురంమన్యం 5, అల్లూరిసీతారామరాజు 8, విశాఖ 1, అనకాపల్లి 14, కాకినాడ 14, కోనసీమ11, తూర్పుగోదావరి 2, పశ్చిమగోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎన్టీఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 12, బాపట్ల 19, ప్రకాశం 8 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత, పల్నాడు జిల్లా నరసరావుపేలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత, ప్రకాశం జిల్లా కనిగిరిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతి జిల్లా నాయుడుపేటలో డిగ్రీల ఉష్ణోగ్రత, కాకినాడ జిల్లా తుని, కృష్ణా జిల్లా కంకిపాడులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత, నెల్లూరు జిల్లా మనుబోలులో డిగ్రీల ఉష్ణోగ్రత, ఏలూరు జిల్లా పెదవేగిలో 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ క్రమంలో.. మరోవైపు తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో ప్రజలంతా వీలైనంత వరకూ ఇళ్లల్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగింటి వరకూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. వయో వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని.. వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తాగాలని సూచించింది. వదులైన వస్త్రాలు ధరించాలని.. నల్లటి దుస్తులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తలపై టోపీ లేదా గొడుగు తీసుకెళ్లాలని చెప్తున్నారు.