రేపు(మంగళవారం) ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11:30 కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపటి సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది.
రేపు ఏపీ సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అందుకోసం.. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి సీఎం పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్…
రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు బాలరాముడు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు.
రేపు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల కానున్నాయి. జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికానికి సంబంధించి లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లోసీఎం జగన్ నిధులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా.. 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అందుకోసం రూ. 584 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 11 లక్షలకు పైగా తల్లుల కాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు (శుక్రవారం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ చేరుకుని.. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.15 కు విజయవాడలో పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్ ను ప్రారంభించనున్నారు.
రేపు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఢిల్లీలో ఉదయం 9.30 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన డిమాండ్‌పై ప్రతిపక్షాలు, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించానున్నారు. మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్ లో ఈ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు అభినందన సభ పై చర్చ జరుగనున్నట్లు సమాచారం.. అంతేకాకుండా, పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా రేపు ఉదయం 10 గంటలకు (సోమవారం, డిసెంబర్ 11న) కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయంలోని నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) పూజలు చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.
రెడ్ మీ స్మార్ట్ ఫోన్కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్‌లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వర్చువల్ ఈవెంట్‌లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్‌మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు.
సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఅర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా మళ్లీ రేపటి నుంచి ప్రచారానికి రెడీ కానున్నారు.