Vande Bharat Train: రేపు ఈ మార్గంలో 20 కోచ్ల తొలి వందే భారత్ ట్రయల్ రన్..
- ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం
- రేపు 20 కోచ్‌లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్ రన్
- 130 కి.మీ వేగంతో ప్రయాణించనున్న ఈ రైలు
- అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్
- ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి..
- మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకోనున్న ట్రైన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 9న) 20 కోచ్‌లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్‌ని భారతీయ రైల్వే నిర్వహించబోతోంది. 130 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలును తొలిసారిగా ట్రయల్ చేయనున్నారు. అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలోని పెద్ద నగరాల మధ్య 16 కోచ్‌లతో.. చిన్న నగరాల మధ్య 8 కోచ్‌లతో వందే భారత్ రైలును నడుపుతున్నారు.
Read Also: Waqf Bill: విపక్షాల ఆందోళనతో “పార్లమెంట్ కమిటీ”కి వక్ఫ్ బిల్లు..
Also Read
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
ప్రస్తుతానికి 16-16 కోచ్‌ల రెండు వందేభారత్ రైళ్లు అహ్మదాబాద్-ముంబై మార్గంలో నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లు ఈ దూరాన్ని చేరుకోవడానికి దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతుంది. ఈ రెండు రైళ్ల నుంచి 100 శాతం రెస్పాన్స్, ఆక్యుపెన్సీ అందుతుంది. ఈ క్రమంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని.. దేశంలోనే మొట్టమొదటి 20 కోచ్‌ల వందే భారత్ రైలును ఈ రెండు నగరాల మధ్య నడపాలని రైల్వేశాఖ భావించింది. ఈ క్రమంలో.. ఈ రైలు ట్రయల్ రన్ కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆగస్టు 9న అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య ట్రయల్‌ను ఆమోదించింది. ఈ మేరకు పశ్చిమ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయానికి రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Paris Olympics 2024: సెమీస్‌కి చేరిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్..
RDSO యొక్క స్పీడ్ సర్టిఫికేట్ ఆధారంగా 20 కోచ్ల వందే భారత్ రైలు వేగం గరిష్టంగా 130 కి.మీ. గంట. ఈ రైలు ట్రయల్ రన్ సమయంలో భద్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అన్ని LC గేట్లు, ఆక్రమణలు.. విరిగిన, తప్పిపోయిన బారికేడింగ్ సైట్ల వద్ద RPF సిబ్బందిని మోహరిస్తారు. ఈ రైలు నడిచే మార్గంలో దాదాపు 50 శాతం అంటే 792 రూట్ కి.మీ పశ్చిమ రైల్వే పరిధిలో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ రైల్వే మార్గంలో పశువుల కంచె, గోడకు కంచె పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
తాజావార్తలు
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?