Medical Alert: పేషెంట్లకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా 24 గంటలు వైద్య సేవలు బంద్
- పేషెంట్లకు బిగ్ అలర్ట్
- దేశవ్యాప్తంగా 24 గంటలు వైద్య సేవలు బంద్
- కోల్‌కతా హత్యాచార ఘటనతో నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు స్తంభించనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఒక రోజంతా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా FAIM నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (FAIM) అధికారికంగా ప్రకటించింది. శనివారం ఓపీడీ(OPD), ఓటీ( OT) సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పేషెంట్లకు, దేశ ప్రజలకు ముందుగానే సమాచారం తెలియజేసింది. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఎమర్జెన్సీలో మాత్రం డాక్టర్లు అందుబాటులో ఉంటారని వెల్లడించింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోనే వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆమెపై సామూహిక అత్యాచారానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉంది. అలాగే ఘటనాస్థలిలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. అంటే బాధితురాలు.. మానవమృగాలతో తీవ్రంగా పోరాడినట్లుగా అర్ధమవుతోంది.
Also Read
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ఇదిలా ఉంటే ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఘోష్ దుర్మార్గుడని ఇరుగుపొరుగు వారు మీడియాకు చెబుతున్నారు. ఇక మాజీ ఉద్యోగులైతే తీవ్ర ఆరోపణలు చేశారు. ఘోష్ తన గెస్ట్ హౌస్‌లో సెక్స్ రాకెట్, డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురై అర్ధనగ్నంగా పడి ఉంటే.. బాధితురాలి తల్లిదండ్రులకు మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఇచ్చాడు. కనీసం పోలీసులకు కూడా ఫోన్ చేయలేదు. అంటే ఇదంతా ఒక ప్రక్క ప్రణాళికతో జరిగినట్లుగా సీబీఐ భావిస్తోంది. సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

తాజావార్తలు
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!