అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ విషయం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్. సుమంత్ కుమార్ యార్లగడ్డ పలు తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా చిత్రాలతో డీసెంట్ హిట్లు కొట్టారు. సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు పెద్ద మనవడు. ఇక ఇప్పుడు సుమంత్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది ఆయనకు రెండవ వివాహం. ఈ మేరకు…
ఈ వారంతంలో ఐదు చిత్రాలు విడుదల కాబోతుండగా, వచ్చే శుక్రవారానికి కూడా చిన్న సినిమాలు క్యూ కట్టడం మొదలెట్టేశాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘మ్యాడ్’ సినిమా కూడా చేరింది. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రలు పోషించిన ‘మ్యాడ్’ ఆగస్ట్ 6న రాబోతోంది. ఈ సినిమాను టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి తమ మిత్రులతో కలిసి నిర్మించారు. లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించారు. పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో…
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాలెన్స్ ఉన్న షూటింగ్ ను కాకినాడ పోర్ట్ లో దర్శకుడు కొరటాల శివ పూర్తి చేసి, అక్కడే గుమ్మడి కాయ కొట్టేస్తాడని అంటున్నారు. ఇదిలా ఉంటే… ‘లూసిఫర్’ మూవీ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ తేదీని చిరంజీవి ఖరారు చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ను ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా మొదలెట్టేశాడు. దర్శక నిర్మాతలు అధికారికంగా చెప్పకపోయినా ఆగస్ట్ 12న…
కోలీవుడ్‌లోని ప్రతిభావంతులైన హీరోలలో ఒకరైన శివకార్తికేయన్ చివరిసారిగా 2019లో “హీరో” చిత్రంలో తెరపై కనిపించారు. కరోనా వైరస్ మహమ్మారి రాకపోయి ఉంటే ప్రస్తుతం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆయన చిత్రాలు చాలా కాలం క్రితమే తెరపైకి వచ్చేవి. ఈ యంగ్ హీరో నటించబోయే ఆసక్తికరమైన ప్రాజెక్టుల విషయానికొస్తే “డాక్టర్”, “అయలాన్”, “డాన్” వంటి కొన్ని చిత్రాలను వరుసగా లైన్ లో పెట్టాడు. ఇది కాకుండా శివకార్తికేయన్ హీరోగా ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది.…
ప్రముఖ పంపిణీ దారుడు, నిర్మాత, ఎగ్జిబిటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ టాలీవుడ్ లో నిర్మాతగా తన పట్టు బిగిస్తున్నారు. దాదాపు పది చిత్రాల నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. కొన్ని సినిమాలను ఆయన సొంతంగానూ, మరి కొన్ని సినిమాలను భాగస్వాములతోనూ కలిసి నిర్మాణం జరుపుతున్నారు. విశేషం ఏమంటే… చిత్ర నిర్మాణంలో రాజీ పడకపోవడం తన నైజం అని తొలి చిత్రం ‘లవ్ స్టోరీ’తోనే నిరూపించారు నారాయణ్ దాస్ నారంగ్. పూర్తిగా…
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయి ఉంటే… ఈజూలై 30వ తేదీ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సందడి చేసి ఉండేది. కానీ అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టుగా… కరోనా సెకండ్ వేవ్ తో అందరి అంచనాలు తల్లకిందులై పోయాయి. అయితే అదృష్టం ఏమంటే… మూడు నెలలుగా మూతపడిన థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. గత శుక్రవారం (23వ తేదీ) తమిళ డబ్బింగ్ సినిమా ‘నేరగాడు’ విడుదల కాగా……
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న కల్పిత కథ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. అయితే..ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.…
నలుపు నారాయణుడు మెచ్చు అంటారు. నలుపుతోనూ వలపుగేలం వేయవచ్చుననీ కొందరు నిరూపించారు. నలుపున్నా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా గెలుపు చూసిన మేటి నటి అర్చన. ఎలా ఉంటేనేం? అర్చన అభినయంలో ఓ అందం ఉండేది. ఆ చూపుతోనే బంధాలు వేసే శక్తీ ఆమె సొంతమే! వాటిని మించి సుగంధాల వాసనలాంటి లావణ్యం అర్చనలో తిష్టవేసుకుంది. ఇన్ని లక్షణాలున్న తరువాత నలుపు, తెలుపుతో పనేంటి!? అర్చనను ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ ఎందరో కీర్తించారు. వరుసగా రెండు సార్లు జాతీయ…
ఎంత గొప్ప మేధావులైనా, జనం నాడి పట్టక పోతే లాభం లేదు – అంటారు. అసలు జనం నాడిని పట్టుకోవడమే పెద్ద విద్య! సదరు విద్యలో ఆరితేరిన వారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారే వరుస విజయాలు చూస్తారు. అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు అలాంటివారే! ఆయన దూరదృష్టి కారణంగానే, అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు అనిపించుకోగలిగారు. దుక్కిపాటి తమ ‘అన్నపూర్ణ’ పతాకంపై జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించి పదికాలాల పాటు జనం మదిలో నిలచిపోయారు. ‘తన…
(జూలై 27న నటుడు, నిర్మాత సాయికుమార్ బర్త్ డే) సాయి కుమార్ కంచు కంఠం అంటే తెలుగువారికే కాదు, కన్నడిగులకూ ఎంతో అభిమానం. సాయి కుమార్ గళం నుండి జాలువారే ప్రతిపదం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆయన గాత్రదానంతో ఎంతోమంది స్టార్స్ గా రాణించారు. అనువాద చిత్రాలకు సాయి గళం ఓ పెద్ద ఎస్సెట్. ఇక నటునిగానూ సాయి తనదైన బాణీ పలికించి జనాన్ని ఆకట్టుకున్నారు. పదహారేళ్ళ ప్రాయంలోనే బాపు తెరకెక్కించిన ‘స్నేహం’లో నటించిన సాయికుమార్ తరువాత…