సీనియర్ హీరో రాజశేఖర్ పారితోషికంగా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. చాలాకాలంగా రాజశేఖర్ చేతిలో సినిమాలు లేవు. “గరుడ వేగ”తో రీఎంట్రీ ఇచ్చిన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. అనంతరం “కల్కి”తో ప్రేక్షకులను పలకరించారు. ఆ తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. ఇటీవలే “శేఖర్” అనే సినిమాను ప్రకటించాడు. తాజాగా గోపీచంద్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కోసం రాజశేఖర్ భారీ పారితోషికం తీసుకున్నారట.
Read Also : న్యూ లుక్ లో పవర్ స్టార్… పిక్ వైరల్
గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం రాజశేఖర్ ఏకంగా 4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ని డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాకుండా తన పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉండాలని ఆయన మేకర్స్ తో చెప్పారట. ఈ మూవీలో హీరో సోదరుడి పాత్ర చాలా కీలకం. రాజశేఖర్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించారు. యూనిట్ ఆయన పెట్టిన అన్ని షరతులకు అంగీకరించిందట. రాజశేఖర్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మేకర్స్ రాజశేఖర్ హీరో తప్ప మరే ఇతర పాత్ర చేయలేదు.