ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా భారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన పోసాని… తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు…
కరోనా కారణంగా థియేటర్లను క్లోజ్ చేయడాన్ని కొందరు ఎగ్జిబిటర్స్ తమకు అనుకూలంగా మలచుకున్నారు. అందులో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కూడా ఒకటి. గతంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి, ఆ తర్వాత కాసేపు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో షికారుకు వెళ్లడం భాగ్యనగర ప్రజలకు అలవాటుగా ఉండేది. వీకెండ్ వస్తే చాలామంది ఉద్యోగులు చేసేదీ ఇదే. హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఒకటిగా మారింది. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు.…
జూలై 30. ఈ యేడాదిలో చాలా కీలకమైన రోజు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకోబోతున్న రోజు. నిజానికి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో థియేటర్లు తెరవమని స్థానిక ప్రభుత్వాలు ఆదేశించినా… థియేటర్ల యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేసింది. చివరకు జూలై 30న వీలైనన్ని థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉన్నా జంట థియేటర్లలో ఒకటి, మల్టీప్లెక్స్ లలో ఒకటి,రెండు మాత్రమే తెరచుకోబోతున్నాయి. ఆంధ్ర…
బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో, సొంత బ్యానర్ లో ‘ఆదిత్య 369’కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ మూవీ ఉంటుందని ఇంతవరకూ వార్తలు వచ్చాయి. బాలకృష్ణ సైతం ‘ఆదిత్య 369’ సీక్వెల్ తో తన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడని, ఆ సినిమాలో తాను కూడా నటిస్తానని చెప్పారు. కానీ ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అది కాకపోవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ…
(జూలై 29న డాక్టర్ సి.నారాయణ రెడ్డి జయంతి)తెలుగు చిత్రసీమ గీతరచనను సింగిరెడ్డి నారాయణ రెడ్డికి ముందు, తరువాత అని విభజించవలసి ఉంటుంది. సినారెకు ముందు గీతరచయితల పోకడలూ, ఆయన తరం వారి బాణీలు, భావితరాన్ని ముందే ఊహించి పలికించిన పదబంధాలు అన్నిటినీ కలిపి చూస్తే తెలుగు సినిమా రంగంలో సినారె చేసిన ప్రయోగాలు మరెవ్వరూ చేసి ఉండరని చెప్పక తప్పదు. సినారెకు ముందు కొందరు పాటలతో పాటు మాటలూ పలికించారు. ‘ఏకవీర’, ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ వంటి…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అదే పని చేశారు స్టార్ డైరెక్టర్స్ అంతా కలిసి. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దానికి ఓ వేడుక కారణమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి జూలై 25న తన 42వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వేడుకలు వంశీ తన స్నేహితులు, చిత్ర పరిశ్రమకు…
ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడాన్ని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణమూర్తి తప్పు పట్టారు. ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కేవలం ఇరవై ఐదు శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, కొన్ని చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల మిగిలిన 75 శాతం మంది ఆ వినోదాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ఇటీవల సురేశ్ బాబు ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేశారని, దానిని కూడా కొద్ది మంది మాత్రమే…
ఎట్టకేలకు రాష్ట్రంలో థియేటర్ల రీఓపెన్ పై నెలకొన్న సస్పెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగించింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా హాళ్లు మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు నెలల విరామం తరువాత 100% సీటింగ్ సామర్థ్యంతో తెలంగాణలో థియేటర్లు తిరిగి ఓపెన్ చేయడానికి అనుమతులు లభించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గతకొంతకాలంగా థియేటర్లను తిరిగి తెరవడంపై సస్పెన్స్ నడుస్తోంది. Read Also : బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ…
మంగళవారం సాయంత్రం జరిగిన “తిమ్మరసు” ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని చేసిన ఉద్వేగభరితమైన స్పీచ్ ఇస్తూ సినీ పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాలను కోరారు. “కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎక్కువగా ప్రభావితమవుతుంది. మహమ్మారి కారణంగా మొదట థియేటర్లు మూసివేయడం, తిరిగి ఓపెన్ చేయడం జరుగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొన్నేళ్లుగా భారీగా పెరిగాయి. కానీ టికెట్ ధర విషయంలో మాత్రం ఆంక్షలు ఉన్నాయి. ఇది కేవలం హీరోలు…
యువ నటుడు శర్వానంద్ తనను తాను మంచి నటుడిగా నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎప్పుడూ స్టార్డమ్ కోసం ఆశించకుండా సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతుంటాడు. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తాడు. ప్రస్తుతం శర్వానంద్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న శర్వాతో జోడి కట్టనుంది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి…