ప్రముఖ సినీ నటుడు, మెజీషియన్ రమణారెడ్డి అభిమానులకు శుభవార్త. నవ్వుల మాంత్రికుని గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన టి.వి. రమణారెడ్డి శత జయంతి సంవత్సరమిది. ఆణిముత్యం లాంటి అరుదైన నటుని శతజయంతి సందర్భంగా ‘నవ్వుల మాంత్రికుడు’ పేరుతో ఓ పుస్తకం రానుంది. ఆయన సమగ్ర జీవిత విశేషాలతో ఈ పుస్తకం సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. మూవీ వాల్యూమ్ మీడియా హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. సీనియర్ జర్నలిస్టు, రచయిత ఉదయగిరి ఫయాజ్ ఈ పుస్తకాన్ని రచించారు. అరుదైన ఫోటోలతో ఈ పుస్తకం అభిమానులను అలరించనుంది.