తొలి చిత్రం ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుజిత్. అయితే ఆ తర్వాత కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే పాన్ ఇండియా మూవీ ‘సాహో’ను చేశాడీ యంగ్ డైరెక్టర్. ఊహించని విధంగా ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. అయినా… ఉత్తరాదిన మాత్రం సుజిత్ కు మేకర్ గా మంచి పేరే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలను సుజిత్ కు…
సీనియర్ కో-డైరెక్టర్, నటుడు ఇరుగు గిరిధర్ (64) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం, ఇరంగారిపల్లిలో 1957 మే 21న గిరిధర్ జన్మించారు. చిత్తూరు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత 1982లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఎ. కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఇవీవీ సత్యనారాయణ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. వినోద్ కుమార్, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించిన ‘శుభముహూర్తం’ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. అయితే ఆ చిత్రం కమర్షియల్…
జూనియర్ ఎన్టిఆర్ హాట్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” మొదటి ప్రోమో నిన్న విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ షోకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన, ఆసక్తికరమైన అప్డేట్స్ మీకోసం. ఈ కార్యక్రమానికి “సోగ్గాడే చిన్ని నాయన” ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అతను మొదటి సీజన్ మొత్తానికి దర్శకత్వం వహిస్తాడు. కొన్ని ఎపిసోడ్లు ఇప్పటికే చిత్రీకరించబడ్డాయి. మేకర్స్ రెండు ప్రత్యేక ప్రోమోలను కూడా సిద్ధం చేస్తున్నారు.…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రంగస్థలం సినిమాలో తన సహచర నటుడు శత్రువు (విలన్ పాత్ర) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సోషల్ మీడియాలో మనం వివిధ రకాల చాలెంజ్ లు చూస్తూ ఉన్నామని గ్రీన్ ఇండియా…
సినిమాల్లోనూ,రాజకీయాల్లోనూ శాశ్వత మిత్రులుకానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని ప్రతీతి. పైగా నటనను పులుముకొని సాగే సినిమా రంగంలో అసలైన స్నేహానికి తావేలేదనీ చెబుతుంటారు. అయితే, అలాంటి అభిప్రాయాలు తప్పు అని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. నాగిరెడ్డి-చక్రపాణిఅలాంటి వారిలో అందరికంటే ముందుగా గుర్తుకు వచ్చేది విజయాధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి. ఒక తల్లి పిల్లల్లాగా చక్రపాణి, నాగిరెడ్డి మసలుకున్నారు. తెలుగు చిత్రసీమలో విలువలతో కూడిన చిత్రనిర్మాణం సాగించారు ఈ ఇద్దరు మిత్రులు. తొలి చిత్రం ‘షావుకారు’ మొదలు, తరువాత…
నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఏఐ) రెగ్యులర్ గా సినిమాలకు సంబంధించిన వివిధ అంశాల్ని, సామాగ్రిని, విశేషాల్ని భద్రపరుస్తూ ఉంటుంది. వీలైనన్ని సినిమాల ప్రింట్స్ తమ వద్ద ఉండేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. భవిష్యత్తులో సినిమాకు సంబంధించి, సినిమా చరిత్రకు సంబంధించి ఏదైనా అధ్యయనం, పరిశోధన చేస్తే అందుకు ఉపయోగపడేలా రకరకాల మూవీ స్పెషల్స్ ని ఎన్ఎఫ్ఏఐ నిరంతరంగా అన్వేషించి భద్రపరుస్తుంది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ చిత్రం ‘పీకే’ నెగటివ్ ప్రింట్లను…
సాధారణంగా కమర్షియల్ సినిమాలన్నీ ప్రేమతో మొదలై పెళ్లితో ‘ద ఎండ్’ అవుతాయి. కానీ, సుమంత్, నైనా గంగూలీ నటించిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా విషయంలో… శుభం కార్డు నుంచీ కథ మొదలయ్యేలా కనిపిస్తుంది! ‘లైఫ్ ఆఫ్టర్ డైవోర్స్’ అంటున్నాడు అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్… నిజానికి ‘మళ్లీ మొదలైంది’ సినిమాకు సంబంధించి ఓ వెడ్డింగ్ కార్డ్ ఫోటో అనూహ్యంగా లీకైంది. దాంతో అందరూ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని భావించారు. రామ్ గోపాల్ వర్మ అయితే రెండో…
సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఫాలోయర్స్ తో షేర్ చేస్తూనే ఉంటారు. అల్లు శిరీష్ ఇందుకు మినహాయింపు కాదు. లెటెస్ట్ గా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో రెండు ఆసక్తికర ఫోటోస్ నెటిజన్స్ తో పంచుకున్నాడు! Read Also : నాగశౌర్యను కిస్ చేసిన హీరోయిన్… “లక్ష్య” పోస్టర్ ‘ప్రేమ కాదంట’ సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్నాను అంటూ ఓ అప్ డేట్…
కరోనా కారణంగా సినిమా థియేటర్లు చాలా కాలంగా మూతపడ్డాయి. సినిమా హాల్లో బొమ్మ పడి చాలా రోజులయింది. ఐతే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం.. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఇప్పటికే కొన్ని సినిమా టయేటర్లు ఓపెన్ అయినా ఇంకా బొమ్మ పడలేదు.. అంతే కాదు సినిమాలు రిలీజ్ చేయడానికి ఏగ్జిబిటర్లు ముందుకు రాలేదు.. దీంతో థియేటర్లు ఎక్కువగా తెరుచుకోలేదు.…
ఎట్టకేలకు మా ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో …ఆన్లైన్ ద్వారా మా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆగస్టు 22న మా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకముందే, అధ్యక్ష పదవికి సిద్ధమంటూ పలువురు ప్రకటించారు. దీంతో మా అసోసియేషన్లో వేడి రాజుకుంది. తాజాగా మా కార్యవర్గ…