టాలీవుడ్ లోని ఓ టాప్ ప్రొడక్షన్ హౌజ్ చరణ్, ప్రభాస్ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటించబోతున్న క్రేజీ మల్టీస్టారర్ కు యువి క్రియేషన్స్ నిర్మించనుంది అంటున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పాన్ ఇండియన్ సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు నిర్మాతలు తమ నిర్మాణ సంస్థలో పని చేసిన ఇద్దరు యువ దర్శకులతో చర్చలు జరుపుతున్నారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే యూవి క్రియేషన్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని సమాచారం.
ప్రస్తుతం రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. రాజమౌళి దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. మరో వైపు ప్రభాస్ కిట్టిలో ఉన్న సినిమాలు విభిన్న నిర్మాణ దశలో ఉన్నాయి. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యామ్”లో ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఓం రౌత్ డైరెక్షన్ లో “ఆదిపురుష్”, ప్రశాంత్ నీల్ “సలార్”, నాగ్ అశ్విన్ “ప్రాజెక్ట్ కే”తో బిజీగా ఉన్నారు.