ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల బండ్లగణేష్ తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. కానీ తాజాగా ఆయన ఓ వెబ్ సైట్ లో ప్రచురితమైన కథనాన్ని రీ ట్వీట్ చేయడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అందులో బండ్ల ఒక జర్నలిస్టు సలహా మేరకు ట్విట్టర్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ఉంది. దీన్ని రీట్వీట్ చేసి ఆ విషయం నిజమేనని బండ్ల గణేష్ నిర్ధారించారు. దీంతో సోషల్ మీడియాలో బండ్ల గణేష్ కు వెల్కమ్ చెబుతూ రీట్వీట్ చేస్తున్నారు.
దానికి ముందు బండ్ల గణేష్ “కొన్ని సార్లు కొన్ని గుడ్ న్యూస్ లను మనలోనే ఉంచుకోవాలని, మనకు మంచి జరుగుతుందని తెలుసుకున్న అందరూ హ్యాపీ గా ఫీల్ అవ్వరు” అంటూ ఉదయాన్నే ట్వీట్ చేసాడు. అయితే బండ్ల గణేష్ ట్వీట్ వెనక కారణం ఏంటో తెలియరాలేదు. అసలు ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశాడో మరి.
Read Also : “ఆర్ఆర్ఆర్” టీం సంబరాలు… పిక్స్ వైరల్
ఇక కమెడియన్ గా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ చిన్న చిన్న పాత్రలు వేస్తూనే నిర్మాతగా ఎదిగారు. తన దేవుడు గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ తో తీన్మార్, గబ్బర్ సింగ్ చిత్రాలను నిర్మించారు. అందులో “గబ్బర్ సిం”గ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అదే జోష్ కంటిన్యూ చేస్తూ తెలుగులో ఉన్న టాప్ స్టార్లతో సినిమాలు నిర్మించాడు.
ఆ తరువాత సినిమాలను వదిలి రాజకీయాల్లో చేరడం, రాజకీయాలు తన ఒంటికి సరిపడవు అని, సినిమా ఇండస్ట్రీనే తనకు కరెక్ట్ అంటూ మళ్లీ వెండితెర రీఎంట్రీ ఇచ్చాడు. “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అందులో ఆయన పాత్రకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా అన్నారు. కానీ అది ఇప్పట్లో తేలేలా లేదు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సోషల్ మీడియా నుంచి దూరం అవుతాను అని చెప్పడం, మళ్లీ మనసు మార్చుకోవడం, ఈ రోజు ఉదయం చేసిన ట్వీట్ వెనకాల అసలు కారణం ఏమై ఉంటుందా అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.