విజయ్ దేవరకొండ శివ నిర్వాణ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా…!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకులు శివ నిర్వాణ, సుకుమార్ తో సినిమాలు చేయటానికి కమిట్ అయ్యాడు విజయ్. ‘లైగర్’ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడంతో… ఈ సినిమా తర్వాత తన మార్కెట్ బాగా పెరుగుతుందనే ఆశతో ఉన్నాడు దేవరకొండ. దానికి తగినట్లు తన తదుపరి సినిమాలను కూడా పాన్-ఇండియా మార్కెట్ లక్ష్యంగా చేయాలనుకుంటున్నాడట. సుకుమార్‌తో సినిమా అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో రూపొందే అవకాశాలు ఉన్నాయి. ‘టక్ జగదీష్’ దర్శకుడు శివనిర్వాణతో సినిమా కూడా అలాగే చేయాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేయమని కోరాడట. అంతే కాదు బడ్జెట్ కూడా పెంచమన్నాడట. శివ నిర్వాణ విజయ్ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలనుకున్నాడు. అయితే నిర్మాతలు బడ్జెట్ ని భారీ స్థాయిలో పెంచేందుకు సిద్ధపడటం లేదట. ఎందుకంటే విజయ్ దేవరకొండ ముందు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పొందాయి. ‘లైగర్’ పైనే విజయ్ ఆశలు పెట్టుకున్నాడు. ఒక వేళ ఆ ప్రాజెక్ట్ తేడా కొడితే మొత్తం తలక్రిందులు అవుతుందనే భయం శివనిర్వాణ నిర్మాతలకు ఉన్నట్లుంది. దీంతో బడ్జెట్ పెంచటానికి సిద్ధపడటం లేదట. అదే విషయాన్ని విజయ్ దేవరకొండకు తెలియచేశారట. దాంతో ఆ సినిమా ఆగిపోయినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రపరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. శివనిర్వాణ ‘టక్ జగదీష్’ తో పాటు ‘లైగర్’ విజయం సాధిస్తే విజయ్ దేవరకొండ ఆశించినట్లు భారీస్థాయిలో ప్యాన్ ఇండియా సినిమా రూపొందే అవకాశాలు లేకపోలేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!