సినిమా పరిశ్రమ పవన్ కళ్యాణ్ సొంత సొత్తుకాదు అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే చిరంజీవి కి ఉన్న హూందాతనం పవన్ కళ్యాణ్ కు లేదు అని తెలిపారు. సినిమా పోర్టల్ అన్ లైన్ వ్యవస్థ కు చిరంజీవి పూర్తి మద్దతు ఇస్తానన్నారు. యుద్ధానికి సిద్ధంకండి అంటూ కార్యకర్తలను పవన్ రెచ్చగొడుతున్నారు. తాలిబన్ తరహా పరిపాలన పవన్ కోరుతున్నట్లు కనిపిస్తుంది అని చెప్పారు. జీఎస్టీ విధానంపై ప్రధానిని ప్రశ్నించి తర్వాత మా ప్రభుత్వ పనితీరును ప్రశ్నించండి అని సూచించారు. స్థానికసంస్థల్లో టీడీపీ జనసేన అక్రమ పొత్తు పెట్టుకున్నాయి.దీని పై పవన్ మాట్లాడగలడా అని ప్రశ్నించారు. జనసేన ఒక్క కాపులకే పరిమితమా అన్న ఆయన కాపులకు మచ్చ తెచ్చే పార్టీ మీది అని పేర్కొన్నారు.