మా కు నిన్నటి రోజున ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 28 ఏళ్ల చరిత్ర కలిగిన మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో 883 మందికి ఓట్లు ఉన్నాయి. ఇందులో 605 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 54 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్లు పోటీ చేయగా, మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలను ఈరోజు ప్రకటించారు.…
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వంలో మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది.…
బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. త్వరలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా కోసం టాక్ షో చేయబోతున్నాడు బాలయ్య. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఈ టాక్ షో నవంబరులో ఆరంభం కానుంది. దాదాపు 8 ఎపిసోడ్స్ తో ఈ షోను ఆరంభించబోతున్నారు. గంట పాటు ఉండే ఈ షో బాలకృష్ణతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులను అతిథులుగా ఆహ్వానించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో షూట్ కూడా పూర్తయింది. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్…
ఆదివానం మా ఎన్నికలలో ఓటు వేయని స్టార్స్ లో మహేశ్ బాబు ఒకరు. ఆయన ఎందుకు ఓటు వేయలేదు అని ఆరా తీసింది ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్. అయితే స్పెయిన్లో ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ యూరోప్ వెకేషన్ లో భాగంగా తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూవస్తున్నాడు. నమ్రత ఇన్స్టాగ్రామ్లో గౌతమ్, సితారతో కలిసి తీసిన సెల్ఫీని షేర్…
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గర్భధారణ గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. 2020 లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. తాజాగా ‘మా కుటుంబంలోకి లిటిల్ వన్’ అంటూ కాజల్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. అయితే ఆ లిటిల్ వన్ మీరు అనుకుంటున్న వన్ కాదు. అసలు విషయం ఏమిటంటే… కాజల్, గౌతమ్ ఇంటికి వచ్చిన ఆ లిటిల్ వన్…
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉండాల్సిన హెల్దీ వాతావరణం గురించి మాట్లాడారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా “పెళ్లి సందD” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి తాజాగా ఇండస్ట్రీలో నెలకొన్న పలు విషయాలను కూడా ప్రస్తావించారు. “పెళ్లి సందD” వేడుకలో అదే వేదికపై ‘మా’ గురించి ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారు. “నా చిరకాల మిత్రుడు విక్టరీ…
సీనియర్ యాంకర్, నటి ఝాన్సీ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. “అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు… ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పండును పెద్దది చేశాయి. ఎద్దు రెచ్చి పోయింది, కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా? సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా,…
ఈరోజు జరిగిన తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసొసియేషన్ ఎన్నికలలో ఉన్న 489 సభ్యులలో 389 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకునే పద్దతికి స్వస్తీ చెప్తూ.. ఈసారి ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడూ అసొసియేషన్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోని సభ్యులు కూడా ఈసారి ఎన్నికలలో యాక్టివ్ గా పాలుపంచుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో ప్రెసిడెంట్ గా పోటీ చేసిన యువ సినిమాటోగ్రఫర్ P.G. విందా అధిక మెజారిటీ తో సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ అయిన హరి…
మొత్తానికీ రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టిన రోజున ‘రహస్య స్నేహితుడు’ ఆచూకీ బయటపెట్టడంతో చిత్రసీమలో నయా లవ్ స్టోరీకి ఇవాళ అఫీషియల్ గా శ్రీకారం చుట్టినట్టు అయ్యింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించి పట్టుమని పది రోజులు కాకముందే, టాలీవుడ్ లో ఓ కొత్త ప్రేమ మొగ్గ తొడిగింది. ఈ రోజు ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ తన బోయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని పరిచయం చేసింది. ఆ తర్వాత కొద్ది సేపట్టికే అతను…
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని… గతంలో ఎన్నడూ ఇలా ప్రచారం, హడావుడి జరగలేదని చెప్పారు. నేను లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ను తాను నమ్మనని…ఆ విషయానికి వస్తే హీరోయిన్లు అందరూ నాన్ లోకాలేనని చురకలు అంటించారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఆలింగనం చేసుకోవడం మంచిదేనన్నారు రోజా. ఎవరు గెలిచినా మా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం…