అరుదైన అభినేత్రి అసిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణమైన నటి అసిన్. ఆమె అందం, చందం, అభినయం అన్నీ విలక్షణంగానే ఉంటాయి. చివరకు ఆమె పేరు కూడా! ‘అసిన్’ అనే పేరులో సంస్కృతం, ఇంగ్లిష్ రెండూ కలబోసుకొని ఉన్నాయని ఆమె అంటారు. ‘సిన్’ అంటే ఇంగ్లిష్ లో పాపం అని అర్థం. దాని ముందు ‘అ’ అన్న సంస్కృత అక్షరం చేరిస్తే, ‘పాపం లేనిది’ అని అర్థం వస్తుందని ఆమె తన పేరులోని విశేషాన్ని వివరించేవారు. ఆమె నటించిన చిత్రాల రాశి తక్కువే అయినా, వాటిలోని వాసి మాత్రం ఎక్కువే అని చెప్పాలి. మాతృభాష మళయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అసిన్ అభినయం అలరించింది.
అసిన్ తొట్టుంకల్ 1985 అక్టోబర్ 26న జన్మించింది. కేరళలోని కొచ్చి ఆమె జన్మస్థలం. బాల్యంలోనే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదిచింది అసిన్. అలాగే మాతృభాషతో పాటు దక్షిణాది అన్ని భాషలనూ చిన్నతనంలోనే నేర్చేసుకుంది. ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఇటాలియన్ భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది. అలా మొత్తం ఎనిమిది భాషల్లో అసిన్ మాట్లాడగలదు. ఇక తాను నటించిన చిత్రాలలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా అసిన్ కు మహా ఇష్టం.
Also Read
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది అసిన్. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత పూరి దర్శకత్వంలోనే నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘శివమణి’లోనూ అసిన్ నాయికగా నటించి ఆకట్టుకుంది.
ఆపై బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’లోనూ, వెంకటేశ్ తో ‘ఘర్షణ’లోనూ హీరోయిన్ గా అభినయించింది అసిన్. చిత్రమేమిటంటే టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ముగ్గురూ పోలీస్ ఇన్ స్పెక్టర్స్ గా నటించిన చిత్రాలలోనే అసిన్ హీరోయిన్ గా నటిండం! ఈ నాలుగు చిత్రాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో అసిన్ తెలుగువారి మదిలో చెరిగిపోని ముద్ర వేసుకుంది. ప్రభాస్ సరసన నటించిన ‘చక్రం’, పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టిన ‘అన్నవరం’ అంతగా అలరించలేకపోయాయి.
తమిళంలోనూ అసిన్ అఖండ విజయాలను చూసింది. ఆమె తమిళంలో నటించిన ‘గజినీ’, ‘దశావతారం’ వంటి చిత్రాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ ఆకట్టుకున్నాయి. ‘గజినీ’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టింది అసిన్. తొలి చిత్రంలోనే ఆమిర్ ఖాన్ తో నటించిన అసిన్ కు ‘గజినీ’ మరపురాని అనుభూతిని పంచింది. ఎందుకంటే మన దేశంలో తొలిసారి వంద కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా ‘గజినీ’ హిందీ సినిమా నిలచిపోయింది. ‘గజినీ’ తరువాత హిందీ చిత్రాలపైనే అసిన్ ఫోకస్ పెట్టింది. సల్మాన్ ఖాన్ సరసన అసిన్ నటించిన ‘రెడీ’ కూడా ఘనవిజయం సాధించింది. “హౌస్ ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786, ఆల్ ఈజ్ వెల్” వంటి హిందీ చిత్రాలలోనూ అసిన్ అందం రసికులకు బంధం వేసింది.
పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ అసిన్ చేసింది. “అవన్, మిరిండా, కాల్గేట్, ఫేయిరెవర్, తనిష్క్, బిగ్ బజార్, ప్యారాచూట్, లక్స్, అమృతాంజన్ హెల్త్ కేర్” వంటి ప్రముఖ సంస్థలకు అసిన్ మోడల్ గా నటించి ఆకట్టుకుంది. 2016లో రాహుల్ శర్మను పెళ్ళాడిన అసిన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. వారికి ఓ పాప, పేరు అరిన్. ఈ నాటికీ అసిన్ చిత్రాలు బుల్లితెరపై ప్రదర్శితమవుతూ ఉంటే అభిమానులు ఆసక్తిగా చూస్తూనే ఉండడం విశేషం!
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!