‘నాట్యం’ దర్శకనిర్మాతలకు చిరంజీవి ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ నిర్మించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘నాట్యం’ సినిమాకు ప్రశంసలు అందించారు. ‘నాట్యం’ సినిమా చాలా చక్కగా ఉండి మంచి ఫీలింగ్‌ను కలిగించింది. నాట్యం అంటే ఓ కథను అందంగా, దృశ్యరూపంలో చూపించడం. నాట్యం అంటే కాళ్లు, చేతులు లయబద్దంగా ఆడించడం అనుకుంటారు కానీ దర్శకుడు రేవంత్, సంధ్యా రాజు మాత్రం కథను అందంగా చెప్పడం అని చూపించారు. ఒకప్పుడు ప్రజలకు ఏదైనా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ గా చెప్పేవారు. ఇందులో అలాగే చూపించారు. కె.విశ్వనాథ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను తీసినట్టు అనిపిస్తోంది.
మన కళలు, నాట్యం, సంగీతంపై ఆయనకున్న గ్రిప్, ప్యాషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు రేవంత్ అలాంటి ప్రయత్నం చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి వారు రావాలి. మన ఆచారాలు, సంప్రదాయాలు, కళలను మరిచిపోతున్న ఈ తరంలో ఇలాంటి ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎంతో ప్యాషన్ ఉన్న సంధ్యా రాజు ఈ సినిమా తీయటానికి ముందుకు వచ్చినందుకు అభినందించాలి. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి డబ్బు కోసం కాకుండా తనకు కళల పట్ల ఎంతో అంకిత భావాన్ని ఉందని చెప్పారు. ఈ సినిమా ద్వారా నాట్యం గొప్పదనం కోట్ల మందికి చేరుతుంది.
Also Read
ఈ సినిమాతో ఆమె తన టాలెంట్‌ను చూపించాలని అనుకున్నారు. అది వృథా కాదు. రేవంత్, సంధ్యా రాజు ఇద్దరిది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ చిత్రం హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. ఇండస్ట్రీని ‘శంకరాభరణం’కు ముందు ‘శంకరాభరణం’ తరువాత అని అంటుంటారు. అలా శంకరాభరణంను ఎంతగా ఆదరించారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదో క్లాసిక్. అలానే నాట్యం సినిమాకు కూడా ప్రజాశీస్సులు దక్కుతాయని ఆశిస్తున్నా’ అని అన్నారు.
సంధ్యా రాజు మాట్లాడుతూ ‘ఈ కళ డబ్బుతో రాదు.. అంకితభావం, కష్టపడే తత్వం ఉండాలి. నాట్యం వల్ల జనాలు గౌరవిస్తారనే నా జీవితాన్ని నాట్యానికి అంకితం చేశాను. ఈ ప్రయాణంలో చిరంజీవి గారిని కలవడం సంతోషంగా ఉంది. ఆయన గొప్ప డ్యాన్సర్. సూర్యుడిలాంటి వారు. ఆయన ఆశీర్వాదం లభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ ఇలాంటి సినిమా ఎలా తీశావ్? అని అందరూ అంటుంటే నాకు భయంగా ఉంటుంది. ఇందులో కేవలం నాట్యం గురించే కాకుండా మన సంస్కృతిని కూడా చూపించాం. తెలుగుదనం ఉట్టిపడే సినిమా. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చిరంజీవి గారు మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?